మోదీకి చెప్పాల్సింది చెప్పా- ఇక ఆయనిష్టం: నా వల్లే ప్రాబ్లమ్ అనుకుంటే..: షిండే క్లారిటీ
New Maharashtra CM: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తోన్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలట్లేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. ప్రతిష్ఠంభన కొనసాగుతూనే వస్తోంది. మహారాష్ట్రతో పాటే ఎన్నికలను ఎదుర్కొన్న జార్ఖండ్‌లో గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోన్నప్పటికీ ఇక్కడ మాత్రం జాప్యం జరుగతోంది.
ఈ పరిణామాలపై తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. థానెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేసినా ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు చెప్పానని అన్నారు. మహాయుటి ప్రభుత్వానికి తన వల్ల ఎలాంటి ఇబ్బందులు రాబోవని చెప్పారు.

మహాయుటి కుటుంబానికి మోదీ పెద్దన్న లాంటి వారని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని, దాన్ని శిరసా వహిస్తానని షిండే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గ కూర్పు విషయంలో బీజేపీ తీసుకునే నిర్ణయమే చివరిదని, దీనిపై తమవైపు నుంచి ఎలాంటి సూచనలు, అభ్యంతరాలు ఉండబోవని తేల్చి చెప్పారు.
ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా శివ సైనికులు నూటికి నూరుశాతం మద్దతు ఇస్తారని, ఇందులో ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండబోవని షిండే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో తాను ఏవేవో షరతులు పెట్టానంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.
గురువారం మహాయూటి పార్టీల భేటీ జరుగబోతోందని, ఇందులో అన్ని విషయాలనూ చర్చిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరవుతారు? ఏ పార్టీకి ఎన్ని పోర్ట్‌ఫోలియోలు దక్కాలి? ఏయే శాఖలు ఎవరికి చెందాలి? అనే విషయాలపై ఈ భేటీ తరువాతే స్పష్టత వస్తుందన విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుటి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారాయన. తనలాంటి ఓ సామాన్యుడు మహారాష్ట్ర వంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయగలిగాడని, అలాంటి ఆశయాల కోసం బాలాసాహెబ్ థాకరే కలలుగన్నారని, దాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా సాకారం చేయగలిగారని షిండే పేర్కొన్నారు. బాలాసాహెబ్ థాక్రే, ప్రజల అభీష్టాల మేరకు తన పాలన సాగిందని అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications