వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బ్రా

మహిళలు ఎలాంటి బ్రా ను ధరించాలి? తప్పుడు సైజు బ్రాను ధరించడం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్పలితాలు ఏంటి? అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి.

దాదాపు 80 శాతం మంది మహిళలు తప్పు సైజు బ్రాను ధరిస్తున్నారు. వారు వేసుకునే బ్రా చిన్నదిగా లేదా పెద్దదిగా ఉంటుంది. లేకపోతే కప్ సైజు సరిగ్గా కుదరకుండా ఉంటుంది.

బ్రా వ్యాపారం మల్టీ మిలియన్ డాలర్లకు విస్తరించింది. కానీ, 10 మందిలో ఎనిమిది మంది మహిళలకు తమ సైజుకు తగిన బ్రా దొరక్కపోవడం దురదృష్టకరం.

ఇలా ఎందుకు జరుగుతుంది? మహిళలు తప్పుడు బ్రాను ఎలా ఎంచుకుంటారో ఇప్పుడు చూద్దాం.

ప్రొఫెసర్ కిఫా మాక్‌బెల్ లండన్‌లోని సెయింట్ జార్జ్ హాస్పిటల్‌లో పనిచేస్తారు. దీని గురించి ఆమె మాట్లాడారు. "మహిళలు తమ వీపు పరిమాణాన్ని కొలిచేటప్పుడు పొరపాటు చేస్తుంటారు. సాధారణంగా వీపు సైజును 4 అంగుళాలు తక్కువగా, కప్‌ సైజ్ (వాస్తవ రొమ్ము పరిమాణం)‌ను 3 అంగుళాల వరకు ఎక్కువగా కొలుస్తుంటారు'' అని కిఫా చెప్పారు.

''మీకు నప్పని, తప్పుడు సైజు బ్రాను ఎక్కువ కాలం వేసుకుంటే మెడ నొప్పి, వీపు నొప్పి వస్తుంది. కొన్నిసార్లు ఇది సర్జరీలకు కూడా దారితీస్తుంది'' అని కిఫా హెచ్చరించారు.

తప్పుడు సైజు బ్రాను ధరించడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అడిగినప్పుడు... భుజం నొప్పి, మెడ నొప్పి, రొమ్ము నొప్పి వంటివి దీర్ఘకాలికంగా వేధిస్తాయని చెప్పారు. బిగుతుగా ఉండే బ్రా పట్టీల కారణంగా చర్మంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడతాయని, బ్రా ఒత్తిడి కారణంగా రొమ్ముల్లో నొప్పి వచ్చే అవకాశముందని చెప్పారు. రాంగ్ సైజ్ బ్రా ధరించడం వల్ల శరీర ఆకృతి కూడా ఆకర్షణీయంగా కనిపించదని అన్నారు.

ఈ అవస్థలను తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం సరైన బ్రాను ధరించడం.

బ్రా

సరైన బ్రాను ఎలా ఎంచుకోవాలి?

శరీరానికి నప్పే, సౌకర్యంగా ఉండే బ్రాను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్‌లో చాలా రకాల బ్రాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ప్యాడెడ్, అండర్‌వైర్డ్, బ్రాలెట్, పుషప్స్ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. కానీ, వీటిలో నుంచి నుంచి సరైన బ్రాను ఎంచుకోవడం ఎలా?

మరీ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే... ఏ, ఏఏ, బీ, సీ, డీ అనే కప్‌ సైజుల్లో ఉండే తేడాలను గుర్తించడం ఎలా?

యూకేలోని కాన్సెంట్ అనే నగరంలో సెడీ అనే మహిళ, 'విమెన్ అండర్‌వేర్ స్టోర్'ను నడుపుతున్నారు. ఈ ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.

''నా ఎదురుగా నిల్చున్న మహిళ తప్పుడు సైజు బ్రా ధరించినట్లు నాకు ఆమెను చూడగానే తెలిసిపోతుంది. ఆమెకు ఏ సైజు బ్రా సరిగ్గా నప్పుతుందో నాకు తెలుస్తుంది'' అని ఆమె అన్నారు.

సైజ్ గైడ్‌లో ఉండే కొలతలు సరిగ్గా ఉండవని భావించి మహిళలు రాంగ్ సైజ్ బ్రాలను వేసుకుంటారని చెప్పారు.

సెడీ, మహిళల వీపు పరిమాణాన్ని కొలిచి, భుజాల మీదుగా కొలత తీసుకొని వారికి తగిన బ్రాను సూచిస్తారు.

బ్రా పట్టీలు మరీ వదులుగా ఉంటే గుల్లగా కనిపించడం, బిగుతుగా ఉంటే భుజాల మీద చర్మం ఒత్తిడికి గురికావడం జరుగుతుంది.

''మంచి బ్రా ధరించడం ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది'' అని సెడీ అంటారు.

బ్రా

తప్పుడు సైజు బ్రాను ధరించినట్లు గుర్తించడం ఎలా?

దీని కోసం సెడీ కొన్ని చిట్కాలను సూచించారు.

మీరు వేసుకున్న బ్రాను గమనించండి..

  • బ్రా నుంచి చనుమొనలు బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపించడం
  • స్ట్రాప్స్ పడిపోయినట్లు ఉండటం
  • వీపు భాగంలో బ్రా పైకి లేచినట్లు ఉండటం
  • బాగా బిగుతుగా, చర్మాన్ని పట్టినట్లుగా ఉండటం
  • బ్రా వేసుకున్న తర్వాత మీకు అసౌకర్యంగా అనిపించడం

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు రాంగ్ సైజ్ బ్రా ధరించినట్లే అని సెడీ చెప్పారు.

బ్రా

పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యే బ్రాను ఎలా గుర్తించాలి?

నిజానికి మనం వేసుకునే దుస్తుల్లో బ్రా అనేది చాలా ముఖ్యమైనదని, దాని కోసం కాస్త ఎక్కువ ఖర్చు పెట్టడం తప్పేమీ కాదని సెడీ అన్నారు.

వేసుకొని చూసే అవకాశం ఉండే దుకాణాల్లోనే కొనాలని ఆమె చెప్పారు. సరైన సైజు విషయంలో దుకాణంలోని హెల్పర్ల సహాయం తీసుకోవాలని అన్నారు.

''దుస్తులపై కాస్త తక్కువ ఖర్చు చేయండి. కానీ, బ్రా కోసం ఎక్కువ వెచ్చించండి'' అని ఆమె సూచించారు.

బ్రా

మీ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..

మీ స్నేహితురాలి సహాయంతో కొలతలు తీసుకోండి.

మొదట బ్రెస్ట్ కింది భాగాన్ని కొలవండి. దానికి 5 అంగుళాలను కలపండి. ఇది మీ వీపు సైజు అవుతుంది.

అంటే, బ్రెస్ట్ కింద స్ట్రాప్ సైజు 28 అంగుళాలు ఉందనుకోండి... అప్పుడు మీ వీపు సైజు 33 అంగుళాలు అవుతుంది. ఒకవేళ బ్రెస్ట్ కింది భాగం 33 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, దానికి 3 అంగుళాలు మాత్రమే కలపాలి. అప్పుడు వీపు సైజు 36 అంగుళాలుగా పరిగణించాలి.

ఇప్పుడు కప్ సైజును ఎలా గుర్తించాలో చూద్దాం. చనుమొనల (బస్ట్) మీదుగా బ్రెస్ట్ కొలతను చూడండి. దీన్ని వీపు సైజు నుంచి తీసేయండి. అప్పుడు కప్ సైజు వస్తుంది. దీన్నికప్‌సైజ్ చార్ట్‌తో పోల్చి చూసి సరైన బ్రా ను ఎంచుకోండి.

ఉదాహరణకు బస్ట్ సైజు 36 ఉండి, వీపు సైజు కూడా 36 ఉంటే.. వాటి మధ్య తేడా 0 అంగుళాలు అవుతుంది.

  • 0 అంగుళాలు- ఏఏ
  • 1 అంగుళం- ఏ
  • 2 అంగుళాలు- బి
  • 3 అంగుళాలు- సి
  • 4 అంగుళాలు- డి
  • 5 అంగుళాలు- డిడి

భవిష్యత్‌లో ఎలాంటి బ్రాలు రానున్నాయి?

భవిష్యత్తులో మైక్రోచిప్‌లతో కూడిన 'స్మార్ట్ బ్రా'లు రానున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీ శరీరం కదులుతున్నప్పుడు వాటంతట అవే బిగుతుగా లేదా వదులుగా అవుతాయి.

ఆకస్మికంగా రొమ్ములలో పెరిగే కణాలను గుర్తించే బ్రాల తయారీపై అధ్యయనాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించాలి అనుకుంటున్నారు.

అయితే దీనికి మరింత సమయం పట్టొచ్చు. అంతవరకు సరైన బ్రాలను ఎంచుకోవడం మీచేతుల్లోనే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
These are the mistakes that women make in choosing a bra,do this to know correct size of the ‘bra’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X