కింగ్ మేకర్స్ ఎవరు ?, మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసిది ఎవరు ?, పార్టీల ఎమ్మెల్యేల బలాబలాలు ఇవే !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడితో కన్నడిగులు మంచి జోష్ మీద ఉన్నారు. గతంలో ఓటర్లు ఇచ్చిన తీర్పు తారుమారు అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వని కన్నడిగులు ఈసారి ఏం చేస్తారో అనే విషయం కొన్ని వారాలు వేచిచూడాలి. గతంలో కన్నడిగులు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు 2018లో స్వతంత్రగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోయారు.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో హెచ్ డీ. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత యడియూరప్ప ఆపరేషన్ కమల పేరుతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పదవికాలం పూర్తి కాకుండానే సీఎం కుర్చి నుంచి యడియూరప్ప పక్కకు తప్పించిన బీజేపీ హైకమాండ్ బసవరాజ్ బోమ్మయ్ ని ముఖ్యమంత్రిని చేసింది.

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు 75 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలతో పాటు కొందరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు మార్చి 29వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటిస్తామని ఎన్నికల కమీషన్ చెప్పింది.
కర్ణాటకలో ఏపార్టీ అధికారంలోకి రావాలన్నా 113 మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కర్ణాటకలో ఏపార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 113. అయితే ఈసారి కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ కేఆర్ పీ వాళ్లవాళ్ల సత్తా నిరూపించుకోవడానికి సిద్దం అవుతున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కన్నడిగులు ఎవరిని ఆశీర్వదిస్తారు ? అనే విషయం మాత్రం కొన్ని వారాలు వేచిచూడాల్సిందే.
ఎవ్వరి మద్దతు లేకుండా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కింగ్ మేకర్లు మేమే అంటూ జేడీఎస్, గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు. 113 మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వాళ్లే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications