• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐఏఎస్ ఆఫీసర్ల రిక్వెస్ట్: ఆత్మహత్యలు వద్దు... ఫేస్‌బుక్‌ పేజ్‌పై మా కష్టాలను చదవండి

|

న్యూఢిల్లీ: వాళ్లు దేశానికి సేవ చేయాలనుకుంటారు. దేశ పరిపాలన విభాగంలో కీలకంగా వ్యవహరిస్తారు. ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు పరిపాలనపై వారు తీసుకునే నిర్ణయాల వెనక వీరి హస్తం ఉంటుంది. ఈ పాటికి వారెవరో అర్థమైపోయి ఉండాలి. అవును వారే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు పొట్టిగా ఐఏఎస్ ఆఫీసర్లు. వారు ఎంతో కఠోర శ్రమతో ఆ స్థాయికి ఎదుగుతారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి అందులో వచ్చిన ర్యాంకు ద్వారా ఐఏఎస్ లేదా ఐపీఎస్‌ లేదా అదే జాబితాలో ఉన్న మరో ఉద్యోగానికి ఎంపిక అవుతారు. ఐఏఎస్ లేదా ఐపీఎస్ స్థాయి అవ్వాలంటే దానివెనక ఉన్న శ్రమ అంతా ఇంతా కాదు. కొన్నేళ్ల కాలంపాటు సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం కష్టపడి చదివి చివరకు పాస్ కాకపోతే కొందరు అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

పరీక్ష రాసేందుకు ఎగ్జామినేషన్ హాలులోకి అనుమతించలేదని మనస్తాపం చెందిన ఓ అభ్యర్థి ఈ ఏడాది జూన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు అభ్యర్థులు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎందుకంటే ప్రతి ఏటా సివిల్స్ పరీక్షకు దాదాపు 5లక్షల మంది హాజరవుతుంటారు. అందులో 1000 లేదా అంతకన్నా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. కొందరు నిరుత్సాహపడి ప్రాణాలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో ధైర్యం నింపేందుకు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ముందడుగు వేశారు.

తమ అనుభవాలను

తమ అనుభవాలను

ఎంతో కఠినంగా ఉండే పరీక్ష గురించి ముందుగా సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు చెప్పదలుచుకున్నారు. ఐఏఎస్ అయ్యేందుకు తామెంత కష్టపడ్డామన్నది తమ అనుభవాల ద్వారా తెలపాలనుకున్నారు. అయితే ఇది కేవలం సోషల్ మీడియా ద్వారానే సాధ్యం అవుతుందని భావించి వెంటనే ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించారు. ఇందులో తమ అనుభవాలను పోస్టు చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపుతున్నారు. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా ఆత్మహత్యలకు పాల్పడకుండా వారిని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఆలోచనలో నుంచి "Humans of LBSNAA"పేరుతో ఫేస్‌బుక్ పేజ్ పురుడుపోసుకుంది. దీనర్థం హ్యూమన్స్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్.

అభ్యర్థుల వ్యధలు కథలు విని కదిలిపోయాం

అభ్యర్థుల వ్యధలు కథలు విని కదిలిపోయాం

"సివిల్ సర్వీసెస్ పరీక్షలు క్లియర్ కానీ అభ్యర్థుల బాధాకరమైన కథలను విన్నాం. కొన్నిసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా వారు తెలిపారు. అయితే సివిల్స్ పరీక్ష పాస్ అవ్వాలంటే దాని వెనక ఎంతటి కష్టముందో ఈ అభ్యర్థులకు అవగాహన లేదని భావించాం."అని వెస్ట్ బెంగాల్ క్యాడర్‌కు చెందిన 2016వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి జితిన్ యాదవ్ తెలిపారు. మరో ఇద్దరి బ్యాచ్‌మేట్స్ తోరుల్ రవీష్, దేవాన్ష్ యాదవ్‌లతో కలిసి ఈ ఫేస్‌బుక్ పేజ్‌ను ప్రారంభించారు. తాము ఐఏఎస్‌లుగా అయ్యేందుకు ఎంత కష్టపడ్డామో, దాని వెనకున్న శ్రమ ఎలాంటిదో తెలుపుతూ కొన్ని వాస్తవ కథలను ఫేస్‌బుక్ పేజ్‌పై రాసి ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నట్లు జితిన్ యాదవ్ తెలిపారు.

చూపులేదు అయినా కెంపొన్నయ్య ఐఏఎస్ అయ్యాడు

చూపులేదు అయినా కెంపొన్నయ్య ఐఏఎస్ అయ్యాడు

జితిన్ యాదవ్ ఈ ఫేస్‌బుక్ పేజ్‌పై ఓ ఐఏఎస్ ఆఫీసర్ కథను పోస్టు చేశాడు. ఆయన పేరు కెంప్హన్నయ్య. 2017వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. తన తొమ్మిదేళ్ల వయస్సులో కంటిచూపును పూర్తిగా కోల్పోయాడు. కళ్ల కనపడక తను వేసుకుంటున్న బట్టలు కూడా తిరిగి తిప్పి వేసుకునేవాడని తెలిపాడు. తన కథ ద్వారా ప్రస్తుతం సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో కెంప్హన్నయ్య మాట్లాడే ప్రయత్నం చేశాడు. పూర్తిగా చూపులేని తను ఎలాంటి ఒత్తిళ్లను అధిగమించాడో తెలిపారు. "నా భార్య రోజుకు 10 గంటలు కష్టపడేది. తను బయటకు చదువుతూ అదేసమయంలో ఆడియో నోట్స్ ప్రిపేర్ చేసేది "అని చెప్పాడు. ఇది మీలో మేల్కొలుపును తీసుకొచ్చేందుకు చెబుతున్న కథ కాదని చెప్పిన కెంప్హన్నయ్య... పరీక్షకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు ఎప్పటికీ తమ లక్ష్యం నుంచి పక్కదోవ పట్టకూడదని చెప్పేందుకే అని వివరించారు.

ఇంకా అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రస్తుతం ఆ ఫేస్ బుక్ పేజ్‌పై ఇతర బ్యూరోక్రాట్ల కథలు కూడా ఉన్నాయని జతిన్ యాదవ్ తెలిపారు. ఈ పేజ్ ద్వారా తాము అభ్యుర్థులతో 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడుతామని జతిన్ చెప్పారు. కొన్ని సార్లు అభ్యర్థులు వాట్సాప్ ఈమెయిల్స్ ద్వారా కూడా కొన్ని ప్రశ్నలు అడిగి తమ వద్ద నుంచి సమాధానాలు పొందుతుంటారని జతిన్ యాదవ్ తెలిపారు.

ఈ ఫేస్ బుక్ పేజ్ మొదలు పెట్టి రెండు నెలలు అవుతోందని వివరించిన జితిన్ యాదవ్ ఇప్పటిదాకా 21వేల మంది ఫాలోవర్లు ఉన్నారని వెల్లడించారు. అంతేకాదు @humansoflbsnaa పేరుతో ట్విటర్ పేజ్ కూడా మొదలు పెట్టినట్లు తెలిపారు.

ఇండియన్ బ్యూరోక్రసీలో ఇలాంటి వాస్తవ కథలెన్నో..

ఇండియన్ బ్యూరోక్రసీలో ఇలాంటి వాస్తవ కథలెన్నో..

ఇప్పటి వరకు ఫేస్‌బుక్ పేజ్‌పై ఉన్నవారంతా చాలామంది యువ బ్యూరోక్రాట్లేనని వారి అనుభవాలు ఎక్కువ కనపడుతాయని చెప్పారు. అయితే భవిష్యత్తులో సీనియర్ ఐఏఎస్ అధికారులు వారి అనుభవాలు కూడా ఈ పేజ్‌పై పోస్టు చేస్తే ఎంతో ఉపకరిస్తుందని ఈ త్రయం భావిస్తోంది. ఈ పేజీని చూసిన ఒక సింగపూర్ మహిళ తమను కలిసినట్లు జితిన్ యాదవ్ తెలిపారు. తన తండ్రి 1962లో భారతదేశంలో తొలి ఇంజినీర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేశారని తన కథను త్వరలో పేజ్‌పై రాస్తానని చెప్పినట్లు జితిన్ వివరించారు.

జితిన్‌తో పాటు తన మిగతా ఇద్దరి స్నేహితులతో చాలామంది సీనియర్ బ్యూరోక్రాట్లు టచ్‌లో ఉన్నారని వారు పడుతున్న శ్రమను చూసి ఉన్నతాధికారులు అభినందించినట్లు జితిన్ తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఎలా క్లియర్ చేశారో అందుకు వారు పడిన కష్టం ఎలాంటిదో ఈ ఫేస్‌బుక్ పేజ్ పై తెలుపుతూ మిగతా అభ్యర్థుల్లో స్ఫూర్తి నింపుతున్నవారిని అభినందిస్తున్నట్లు తెలిపారు హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీలో సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయిన అనిల్ స్వరూప్. బ్యూరోక్రసీకి ఇది కచ్చితంగా కొత్త అర్థం తీసుకొస్తుందన్నారు. నాణేనికి మరోవైపున్న ఇండియన్ బ్యూరోక్రసీని ఈ ముగ్గురు యువ ఆఫీసర్లు మరో కోణంలో ఆవిష్కరించారని తెలిపారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులు ఎలాగైతే సివిల్ సర్వీసెస్ పరీక్షను క్లియర్ చేసి ఆఫీసర్లుగా తయారువుతున్నారో అనే కథనాలు రాయడం వల్ల... ఇది కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నవారే సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాలన్న భావన కలిగిస్తోందని అన్నారు. దీక్ష పట్టుదల కష్టపడేతత్వం ఇష్టంగా చదివే తత్వం ఉన్నవారెవరైనా సివిల్స్ రాయొచ్చని చెప్పారు అనిల్ స్వరూప్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Back in June, a 28-year-old UPSC aspirant committed suicide for not being allowed entry into the examination hall. It was another chilling reminder of the kind of pressure aspirants face — nearly five lakh appear for the examination every year, and less than a thousand end up getting selected.The incident spurred three young IAS officers into action. They startes a facebook page called as‘Humans of LBSNAA’ — standing for the Lal Bahadur Shastri National Academy of Administration, the finishing school for India’s civil servants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more