అక్కాచెల్లెళ్ల గ్యాంగ్ రేప్: ఎత్తుకెళ్లి ఘోరం చేశారని..
బాదౌన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కాచెల్లెళ్ల సామూహిక అత్యాచారంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. పోలీసులు సరైన సమయంలో తగిన విధంగా చర్యలు తీసుకుని ఉంటే ఆ సంఘటన జరిగి ఉండేది కాదని అమ్మాయిల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ సంఘటనలో ప్రభుత్వం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
14, 15 ఏళ్ల వయస్సు గల కజిన్స్ శవాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాదౌన్ జిల్లా కర్తా గ్రామంలో చెట్టుకు వేలాడుతూ బుధవారం కనిపించాయి. పోలీసులు సరైన సమయంలో చర్యలు తీసుకుని ఉంటే అమ్మాయిలు బతికి ఉండేవారని ఒక్క అమ్మాయి తండ్రి అన్నాడు.

మంగళవారం రాత్రి అమ్మాయిలు కనిపించకుండా పోయిన తర్వాత వారి సోదరుడు వెతకడానికి వెళ్లి తిరిగి వచ్చి - గ్రామంలోని కొంత మంది అమ్మాయిలను ఎత్తుకుపోయారని చెప్పాడు. నిందితుడి ఇంటికి కుటుంబ సభ్యులు వెళ్లి గొడవ కూడా పడ్డారని మీడియాలో వార్తలు వచ్చాయి. అమ్మాయిలో తమ ఆధీనంలోనే ఉన్నారని, విడిచి పెట్టేది లేదని వారు చెప్పారు. ఆ సమయంలో నిందితుల ఇంటి వద్ద పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నాడని అమ్మాయి తండ్రి చెప్పాడు.
తాము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లామని, అయితే పోలీసులు ఫిర్యాదును తీసుకోలేదని అమ్మాయిల కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంతలో అమ్మాయిలిద్దరూ చనిపోయినట్లు సమాచారం అందింది. గ్రామస్తులు ఆగ్రహంతో ఆందోళనకు దిగిన తర్వాతనే పోలీసులు రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications