శశికళకు 'జైలు శిక్ష': వాళ్లకు ముందే తెలిసిపోయిందా!?..ఎలా?

ఎవరో భక్తుడికి కలలో శివమనలై కనిపించి ఆలయంలోని ఉత్తర్వుల పెట్టెలో ఇనుపగొలుసును పెట్టి పూజించాలని ఆదేశించాడు.

చెన్నై: తిరుప్పూర్‌ జిల్లా గాంగేయం శివనమలైలో ప్రసిద్ధిగాంచిన సుబ్రమణ్యస్వామి దేవాలయం ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఆలయంలో కొలువుదీరిన శివనమలై అండవర్ జరగబోయే దాన్ని భక్తుల కలలోకి వచ్చి చెబుతుంటాడు.

ఆ మేరకు కలలో శివమనలై అనుగ్రహం పొందినవారు ఆయన ఆదేశానుసారం నడుచుకుంటారు. ఆయన ఆదేశాలను తెలిపే విధంగా ఆలయంలో ఓ ఉత్తర్వుల పెట్టె ఉంటుంది. శివమనలై అనుగ్రహం పొందిన భక్తులు కలలో తమకు దేవుడు ఏ వస్తువునైతే సూచిస్తాడో.. ఆ వస్తువును తీసుకొచ్చి ఉత్తర్వుల పెట్టెలో పెడుతారు. అనంతరం దానికి పూజలు చేస్తారు.

they predicted supreme court verdict on sasikala

అన్నాడీఎంకె కార్యదర్శి శశికళ వ్యవహారంలోను ఇదే జరిగింది. ఎవరో భక్తుడికి కలలో శివమనలై కనిపించి ఆలయంలోని ఉత్తర్వుల పెట్టెలో ఇనుపగొలుసును పెట్టి పూజించాలని ఆదేశించాడు. దీంతో ఆలయ పూజారులకు విషయం తెలిపిన సదరు భక్తుడు.. జనవరి 10న ఉత్తర్వుల పెట్టెలో ఇనుపగొలుసును ఉంచాడు.

అనంతరం దానికి పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 14న శశికళకు జైలు శిక్ష ఖరారు చేస్తూ సుప్రీం నుంచి తీర్పు వెలువడింది. ఇది యాథృచ్చికమో.. మరేమో గానీ అక్కడ ఇలాంటి ఆచారం మాత్రం చాన్నాళ్లుగా కొనసాగుతోంది. గతంలో శివనమలై అండవర్ ఉత్తర్వుల పెట్టెలో ఇనుప గొలుసును ఉంచి పూజించగా.. చైనా యుద్దం, జలాన్ని ఉంచి పూజించగా సునామీ వచ్చినట్టు అక్కడివారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+