Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆ నర్సు నగ్న ఫోటోలు,వీడియోలు... పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఓ దొంగ చేసిన పనికి ఓ నర్సు వైవాహిక జీవితం చిక్కుల్లో పడింది. ఆమె సెల్‌ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి అందులో ఆమె ప్రైవేట్ ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో లీక్ చేశాడు. అంతేకాదు,పనిచేసే చోట ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయని... అందుకు సాక్ష్యంగా కొన్ని ఫోటోలు,వీడియోలను ఏకంగా ఆమె భర్తకే పంపించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు,బంధువులందరికీ విషయం తెలియడంతో ఆమె చాలా డిస్టర్బ్ అయింది. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

బాధితురాలి కథనం ప్రకారం... మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె(28) నర్సుగా పనిచేస్తోంది. మే 2వ తేదీన విధుల్లో ఉన్న సమయంలో ఆమె సెల్‌ఫోన్ చోరీకి గురైంది. అందులో ఆమె వ్యక్తిగత ఫోటోలు,వీడియోలు ఉన్నాయి. అయితే ఆ ఫోన్ దొరక్కపోవడంతో ఆమె కొత్త సెల్‌ఫోన్ కొనుగోలు చేసింది. మరో నంబర్‌తో సిమ్ కార్డు తీసుకుని ఉపయోగిస్తోంది. ఇదే క్రమంలో కొద్దిరోజుల క్రితం ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఆమె నగ్న ఫోటోలు,అశ్లీల ఫోటోలు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షమయ్యాయి. ఆమె సెల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తి ఇలా వాట్సాప్ గ్రూపులో ఫోటోలు పోస్ట్ చేశాడు.

ఆమె భర్తకు ఫోన్ చేసి మరో షాకిచ్చాడు...

ఆమె భర్తకు ఫోన్ చేసి మరో షాకిచ్చాడు...

అక్కడితో ఆగలేదు... కొద్దిరోజులకు అతను ఏకంగా ఆమె భర్తకే ఫోన్ చేశాడు. నీ భార్య పనిచేసే ఆస్పత్రిలో అక్కడి సిబ్బందితో ఆమెకు సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. ఆ ఫోటోలు,వీడియోలు కూడా తనవద్ద ఉన్నాయని తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతను భార్యను నిలదీశాడు. అప్పటినుంచి తరుచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అవి తన ఫోటోలు కాదని,మార్ఫింగ్ ఫోటోలని భర్తతో ఆమె చెప్పినప్పటికీ అతను వినిపించుకోలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించి తనను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసింది.

పరిచయం ఉన్న మహిళ పనే..?

పరిచయం ఉన్న మహిళ పనే..?

తన సెల్‌ఫోన్ దొంగిలించిన వ్యక్తి అందులో ఉన్న తన వ్యక్తిగత ఫోటోలు,వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.అతని వల్ల తన వైవాహిక జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ నర్సుకు పరిచయం ఉన్న వ్యక్తులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఆ నర్సు వద్దకు తరుచూ వచ్చే ఓ మహిళపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+