60అడుగుల, 500 టన్నుల బ్రిడ్జిని చోరీ చేసిన దొంగలు; ఇరిగేషన్ అధికారులకు షాక్!!

కాదేదీ దొంగతనానికి అనర్హం అని భావించిన కొందరు దొంగలు ఏకంగా 60 ఫీట్ల పొడవున్న బ్రిడ్జిని దొంగతనం చేశారు. సహజంగా దొంగతనం అంటే విలువైన బంగారం, డబ్బు, విలువైన వస్తువులు ఇలాంటివి ఎత్తుకెళుతూ ఉంటారు. కానీ ఏకంగా 60 ఫీట్ల పొడవున్న బ్రిడ్జిని ఎత్తుకు వెళ్లారంటే ఆ చోర శిఖామణుల తెలివి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక సదరు దొంగలు తమ చోరీపై ఎటువంటి అనుమానం రాకుండా, స్థానికంగా ఉన్న మనుషుల్ని కూడా వాడుకుని మరీ దొంగతనం చేశారంటే వీళ్ళు మామూలు దొంగలు కాదు అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు దొంగలు చోరీ ఏ విధంగా చేశారు? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే

మూడు రోజులలో బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు

బీహార్‌లోని రోహతాస్ జిల్లా నస్రీగంజ్‌లోని అమియావార్‌లో 1972లో అర కెనాల్‌పై నిర్మించిన ఇనుప వంతెన ప్రస్తుతం పాడుబడిపోయి, శిథిలావస్థకు చేరుకుంది. 60 ఫీట్ల పొడవున్న, 500 టన్నుల బరువున్న ఇనుప వంతెనను అత్యంత చాకచక్యంగా దొంగలు చోరీ చేశారు. నీటిపారుదల శాఖ అధికారుల వలె నటిస్తూ దొంగలు 60 అడుగుల 500 టన్నుల పాత వంతెనను దొంగిలించారు. దొంగలు అధికారులుగా నటిస్తూ బుల్‌డోజర్లు, గ్యాస్ కట్టర్‌ల సాయంతో బ్రిడ్జి మొత్తాన్ని కోసి కూల్చివేసి వాహనాలపైకి ఎక్కించారు. మొత్తం మూడు రోజుల వ్యవధిలో దొంగలు బ్రిడ్జి మొత్తాన్ని మాయం చేశారు.

నీటిపారుదల శాఖ అధికారులుగా నటించి, నమ్మించిన దొంగలు.... స్థానికుల సాయంతో చోరీ

నీటిపారుదల శాఖ అధికారులుగా నటించి, నమ్మించిన దొంగలు.... స్థానికుల సాయంతో చోరీ

దొంగలు నీటిపారుదల శాఖ అధికారులుగా నటిస్తూ స్థానిక శాఖాధికారుల సహకారం కూడా తీసుకున్నారు. దొంగల మాయ మాటలు నమ్మిన స్థానికులు కూడా వారికి సహకరించారు. బ్రిడ్జి మరమ్మతులు చేస్తున్నట్లుగా భావించారు. కానీ పట్టపగలు అందరూ చూస్తుండగా బ్రిడ్జి మొత్తాన్ని కూల్చివేసి, ఇనుప వంతెనను దొంగలించుపోయారు. అయితే స్థానికులు రిపేర్ లకు తీసుకెళ్తున్నట్టు భావించారు.

ఇరిగేషన్ అధికారులు షాక్.. బ్రిడ్జి దొంగతనం అయిందని గుర్తింపు

ఇరిగేషన్ అధికారులు షాక్.. బ్రిడ్జి దొంగతనం అయిందని గుర్తింపు


ఇక ఆపై గ్రామానికి వచ్చిన నీటి పారుదల శాఖ అధికారులు బ్రిడ్జి మాయం కావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విషయమై స్థానిక అధికారులను, గ్రామస్తులను ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ అధికారులే బ్రిడ్జిని ఎత్తుకు వెళ్లారని స్థానికులు చెప్పడంతో ఒక్కసారిగా వారు కంగుతిన్నారు. ఆ తర్వాత బ్రిడ్జి చోరీకి గురైందని గుర్తించారు. దొంగలు నీటిపారుదల శాఖ అధికారి వేషాలు వేసుకుని పూర్తి ప్రిపరేషన్‌తో వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజినీర్ అర్షద్ కమల్ షమ్సీ తెలిపారు.

పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన ఇరిగేషన్ అధికారులు

పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన ఇరిగేషన్ అధికారులు

ఎన్నో దశాబ్దాలుగా శిథిలావస్థకు చేరిన ఈ ఇనుప వంతెనను ప్రజలు వినియోగించుకోవటం లేదు. ఈ వంతెనను తొలగించాలని గ్రామస్తులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే గ్రామస్తులు వచ్చింది అధికారులేనని, తమ ఫిర్యాదు మేరకే వచ్చారని భావిస్తే, అలా కాకుండా దొంగలు దానిని మాయం చేశారు. దాదాపు 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న ఇనుప వంతెన చోరీకి గురవ్వడంతో గ్రామస్తులకు, శాఖాధికారులకు తాము మోసపోయామని అర్థమైంది. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి చోరీపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+