• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇన్‌కమ్ టాక్స్ పన్ను ఆగష్టు 31లోగా చెల్లించలేదా...ఏం జరుగుతుంతో చూడండి..?

|

న్యూఢిల్లీ: మీరు మీ ఆదాయపు పన్ను కట్టలేదా..? ఇన్‌కం టాక్స్ కట్టేందుకు చివరి తేదీ కూడా అయిపోయిందని దిగులు చెందుతున్నారా...? అయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్‌కమ్ టాక్స్ తర్వాతైనా ఎలా కట్టొచ్చో ఇప్పుడు చూద్దాం....

ఆదాయపు పన్ను చివరితేదీలోగ కట్టేముందు కొన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మీకు సంబంధించిన తేదీలను తెలుసుకుందాం. ముందుగా జనరల్ కేటగిరీ అంటే జీతాలు లేదా వేతనాలు పొందుతున్న వ్యక్తులు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేందుకు చివరి తేదీ ఆగష్టు 31. ఒకవేళ మీరు ఏదో పనిమీద కట్టడంలో విఫలమైనా... మీ ఆడిటింగ్ ఆలస్యమైనా సెప్టెంబర్ 30లోపు మీరు మీ పన్నును కట్టొచ్చు. అంతేకాదు ఒక సంస్థలో ఉన్న పార్ట్‌నర్‌కు కూడా ఇది వర్తిస్తుంది. సంస్థలో టాక్స్ ఆడిట్ ఇంకా జరగకపోతే సెప్టెంబర్ 30లోగా పన్ను కట్టే అవకాశం ఉంది. ఇక వ్యాపారవేత్తలు వారి వ్యాపారంలో ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ఉంటుంది కనుక అలాంటి వారికి నవంబర్ 30 పన్నుకట్టేందుకు చివరితేదీ.

This is What happens if you dont file your Incometax Returns in time

ఆదాయపు పన్నుకట్టేందుకు మీకిచ్చిన గడువు ఆగష్టు 31. ఈలోగా మీరు పన్నుకట్టకపోతే మార్చి 31,2019లోగా పన్ను కట్టే అవకాశం ఇంకా మీకుంది. మార్చి 31 తర్వాత మీరు పన్ను కట్టే అవకాశం కోల్పోయి చట్టపరంగా చర్యలు తీసుకోబడుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీరు చేస్తున్న వ్యాపారాల్లో భారీ నష్టం వచ్చి మీరు ఆదాయపు పన్ను కట్టలేకపోతే... ఆ తర్వాత సంవత్సరాల్లో వచ్చే లాభాల్లో కడదామనుకుంటే అది చెల్లదు. ఆ సంవత్సరానికి సెపరేటుగానే పన్నుకట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదాయపు పన్ను నుంచి మీకు టాక్స్ రీఫండ్ జరిగితే..మీరు పన్ను కట్టడంలో ఆలస్యం చేసినందుకు దానిపై వచ్చే వడ్డీని మీరు కోల్పోతారు.

ఒకవేళ ఆగష్టు 31న మీరు టాక్స్ కట్టకపోతే ఆ తర్వాత ఎప్పుడైతే కడతారో అప్పుడు ఫైన్‌తో కలిపి కట్టాల్సి ఉంటుంది. ఆలస్యంగా కట్టినందుకు కట్టాల్సిన జరిమానా డబ్బు మొత్తం ఆదాయం, చివరిగా ఎప్పుడు పన్ను కట్టావనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆగష్టు 31న కట్టాల్సిన పన్నును మీరు డిసెంబర్ 31న చెల్లించారునుకుందాం... అప్పుడు ఆలస్యంగా కట్టినందుకు జరిమానా రూ.5వేలు కట్టాల్సి ఉంటుంది. ఈ డెడ్‌లైన్ లోగా కూడా మీరు పన్ను కట్టడంలో విఫలమైతే జరిమానా రూ. 10వేలకు పెరుగుతుంది. అయితే చిన్నమొత్తంలో పన్ను కట్టే వారు అంటే ఏడాదికి రూ.5లక్షల ఆదాయం ఉన్నవారు మాత్రం జరిమాన రూ.1000 మాత్రమే ఉంటుంది.

ఒకవేళ మీ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ మార్చి 31లోగా కూడా ఫైల్ చేయలేదంటే... లేదా మార్చి 31నే మీరు టాక్స్ కట్టారంటే...ఆదాయపు పన్ను శాఖ 50శాతం పెనాల్టీ విధించే అవకాశం ఉంది. రూ.3వేల కంటే పన్ను ఎక్కువగా కట్టాల్సి వచ్చి చివరితేదీలోగా కట్టలేదంటే ఆదాయపుశాఖ పన్నుఎగవేత కింద మిమ్మలను విచారణ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మీకు రెండు నుంచి ఏడేళ్ల పాటు జైలుశిక్ష ఉంటుంది. అది కూడా మీరు పన్ను ఎంత ఎగవేశారో అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

సో... ఇలాంటి కష్టాలన్నీ వద్దనుకుంటే ఇచ్చిన గడువులోపు మీ ఆదాయపు పన్ను కడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
People are under the impression that if they fail to file their income tax return by the due date, they cannot file it later on. This due date is perceived to be sacrosanct and is a now or never thing. This is not so.For general category, which covers all the salaried persons, the due date for filing of the income tax return is August 31.In case you fail to file your income tax return by August 31, you can still file the same by March 31, 2019 and not beyond that.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more