రాత్రిపూట: మెరుస్తున్న ఇండో-పాక్ బోర్డర్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆదివారం తన ఫేస్‌బుక్ పేజిలో భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు ఫోటోలను పోస్ట్ చేసింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో ఉన్న ఓ వ్యోమగామి భారత్, పాక్ సరిహద్దులతో పాటు కరాచీ, ఇండస్ నదీ ప్రాంతం, హిమాలయాలను చూపుతూ ఈ చిత్రాన్ని తీశాడు.

ఈ ఫోటోలను సెప్టెంబర్ 23వ తేదీన 28 మిల్లిమీటర్ల లెన్స్ కలిగిన నికాన్ డీ4 డిజిటల్ కెమెరా సాయంతో బంధించాడు. ఈ ఫోటోల్లో భారత్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతుంది.

నిత్యం ఎల్లప్పుడూ చొరబాట్లు, రాత్రిపూట కాల్పులు మోతలు వినిపించే ఈ ప్రాంతంలో ఇరు దేశాలు భద్రతాపరంగా గట్టి తీసుకోవడంతో, అంతరిక్షం నుంచి చూస్తే భారత్-పాకిస్థాన్ సరిహద్దులు లైట్ల కాంతులతో మెరుస్తూ కనిపించాయి.












Click it and Unblock the Notifications