వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలాంటి వారే ఈ దేశానికి అతి పెద్ద శతృవులు - ప్రధాని మోదీ మాస్ వార్నింగ్..!!

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవ్వాళ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యటించారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరి కొన్నింటిని ప్రారంభించారు. వాటి విలువ 75,000 కోట్ల రూపాయలు. దీనితో పాటు గోవాలో కొత్తగా నిర్మించిన మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఆయన జాతికి అంకితం చేశారు. నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఫేస్-1ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

వైఎస్ షర్మిల్ హెల్త్ బులెటిన్ - అందులో కీలక అంశాలువైఎస్ షర్మిల్ హెల్త్ బులెటిన్ - అందులో కీలక అంశాలు

మెట్రో రైలులో ప్రయాణం..

మెట్రో రైలులో ప్రయాణం..

నాగ్‌పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ వ్యయం 6,700 కోట్ల రూపాయలు. దీనితో పాటు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2 నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మెట్రో రైలులో ప్రయాణించారు. ఫ్రీడమ్ పార్క్ స్టేషన్ నుంచి నుంచి ఖాప్రీ వరకు టికెట్ కొని ట్రావెల్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం నాగ్‌పూర్‌లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రారంభించారు

 ఎయిమ్స్‌తో..

ఎయిమ్స్‌తో..

విదర్భ ప్రాంతానికి చెందిన ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని నాగ్‌పూర్‌లో నిర్మించినట్లు మోదీ చెప్పారు. గడ్చిరోలి, గోండియా, మేల్‌ఘాట్‌ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఆదివాసీలకు ఈ ఆసుపత్రి వర ప్రదాయినిగా మారుతుందని ఆయన అభివర్ణించారు. దీని తరువాత హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ ఫేజ్-1ను మోదీ జాతికి అంకితం చేశారు.

మౌలికరంగం బలోపేతం..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తాను ఇవ్వాళ ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ మహారాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను ఆయా ప్రాజెక్టులు మరింత బలోపేతం చేస్తాయని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో పయనింపజేస్తాయని చెప్పారు. మహారాష్ట్ర, కేంద్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

మానవీయ కోణంలో..

మానవీయ కోణంలో..

దేశంలో మొట్ట మొదటిసారిగా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మానవీయ స్పర్శను అందించామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మానవీయ కోణంలో అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టామని పేర్కొన్నారు. సమాన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోన్నామని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇందులో రాజీ పడాల్సిన అవసరం లేదని, దేశం సమగ్రంగా అభివృద్ధి చెందినప్పుడే వాటి ఫలితాలు సామాన్యులకు అందుతాయని అన్నారు.

 షార్ట్ కట్ రాజకీయాలకు వ్యతిరేకిని..

షార్ట్ కట్ రాజకీయాలకు వ్యతిరేకిని..

షార్ట్ కట్ రాజకీయాలకు తాను బద్ధ వ్యతిరేకినని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అలాంటి షార్ట్‌ కట్ రాజకీయాలకు పాల్పడే వారికి తాను హెచ్చరికలను జారీ చేస్తోన్నానని చెప్పారు. షార్ట్‌ కట్‌లను అనుసరించే రాజకీయ నేతలే దేశానికి అతి పెద్ద శతృవులని హెచ్చరించారు. అలాంటి వారితో దేశ ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని ధ్వజమెత్తారు.

నాలుగో పారిశ్రామిక విప్లవం..

నాలుగో పారిశ్రామిక విప్లవం..

దేశం సుస్థిరమైన వృద్ధి రేటును సాధిస్తోందని, దీన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించేలా చర్యలను తీసుకుంటోన్నామని ప్రధాని వివరించారు. అభివృద్ధిని సాధించాలంటే- దీర్ఘకాలిక దృష్టి అవసరమని, అదే కీలకమైనదని ఆయన తేల్చి చెప్పారు. భారత్ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని సాధించడానికి ఎంతో దూరం లేదని అన్నారు. అలాంటి విలువైన అవకాశం మళ్లీ రాదని ఆయన వ్యాఖ్యానించారు. సమగ్ర, సుస్థిరాభివృద్ధికే దేశ ప్రజలు ఎప్పుడూ పట్టం కడతారని చెప్పారు.

English summary
PM Modi warns at Nagpur after inaugurate the several projects, those political leaders adopting shortcuts are the biggest enemies of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X