వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదు..! రౌడీ పార్టీలు అంతం కాక తప్పదప్ప బీజేపి చీఫ్..!!

|
Google Oneindia TeluguNews

లఖ్‌నవూ/హైదరాబాద్ : యూపీలో పర్యటిస్తున్న అమీత్ షా అక్కడ ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలను దుమ్మెత్తి పోసారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)-సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ)ల కూటమి ఉండదని, ఈ రెండు పార్టీలు మళ్లీ విడిపోతాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో బీజేపీ నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ...

సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. గత బీఎస్పీ, ఎస్పీ ప్రభుత్వాల పాలనలో రాష్ట్రంలోని ప్రజలను రౌడీలు వేధించేవారని, అటువంటి వారికి గట్టిగా బుద్ధి చెబుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం శాంతి, భద్రతలను పరిరక్షిస్తోందని షా స్పష్టం చేసారు.

Those two parties in UP do not survive..!Ruody parties disappear soon says the BJP Chief..!!

ఒకరిని ఒకరు కనీసం పలకరించుకోని మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌.. ఇప్పుడు ప్రధాని మోదీని ఓడించడానికి చేతులు కలిపారని అమీత్ షా మండిపడ్డారు. ఎన్నికల తర్వాత వారి కూటమి ఉండదు అని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు తాను ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు చేస్తున్న మోదీ.. మోదీ నినాదాలు తన చెవిలో మారుమ్రోగాయని అన్నారు.

కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం లేదని, ఆ పార్టీ దేశ అంతర్గత భద్రతను నాశనం చేసిందని మండిపడ్డారు. చొరబాటుదారులను అరికట్టడంలోనూ ఏమీ చేయలేక పోయిందని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ఈ చర్యలకు పాల్పడిందని షా ఎద్దేవా చేసారు. దేశాన్ని 55 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌ కోసం ఏమీ చేయలేదని, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలంటూ వ్యాఖ్యలు చేసిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాకు కాంగ్రెస్‌ మద్దతుగా నిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

English summary
Mayawati and Akhilesh Yadav never let anyone at least talk to each other. Now Amit Shah blamed the hands for defeating Prime Minister Modi. Commented that their alliance was not exists after the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X