రెండు బస్తాల వెయ్యి నోట్లను.. నడిరోడ్డుపై చించేశారు..
కోల్‌కతా : పెద్ద నగదు నోట్ల రద్దుతో.. అక్రమంగా కూడబెట్టిన డబ్బును రోడ్డుపై పారేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నాడు ద్వారకా తిరుమలలో ఓ కారు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వెయ్యి నోట్లను వెదజల్లుతూ పోగా.. తాజాగా కోల్ కతాలోని గోల్ఫ్ క్లబ్ సమీపంలో నడిరోడ్డుపై కుప్పలు కుప్పలుగా వెయ్యి నోట్లు దర్శనమిచ్చాయి.
అయితే ఆ నోట్లన్ని చించేసి ఉండడం గమనార్హం. దాదాపు రెండు బస్తాల రూ.500, రూ.1000 నోట్లను గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై చించిపారేశారు. పొద్దున్నే రోడ్డుపై నోట్ల కుప్పలు చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. చించేసిన నోట్లను పరిశీలించారు. ఖచ్చితంగా ఇది నల్ల కుబేరుల పనే అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

కొసమెరుపు ఏంటంటే.. చించేసిన నోట్లను జాలిగా చూసిన జనం.. 'ఇలా చించేసే బదులు తమలాంటి పేదలకు పంచితే బాగుండేది కదా!' అంటూ ధీనంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications