జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: 3గురు జవాన్ల మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గల హంద్వారా ప్రాంతంలో మిలిటెంట్లతో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనిక జవాన్లు ప్రాణాలు విడిచారు. మిలిటెంట్లకు, భారత సైన్యానికి మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు ముగ్గురు జవాన్లను కోల్పోయామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.
లోలాబ్ లోయకు సమీపంలోని దర్ద్‌పొరాలో భద్రతా బలగాలు ఓ మిలిటెంట్‌ను కాల్చి చంపిన నేపథ్యంలో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ టాప్ కమాండర్‌తో పాటు ఇద్దరు జైషే మొహమ్మద్ మిలిటెంట్లు హతమయ్యారు.

కుప్వారా జిల్లాలోని హంద్వారా అటవీ ప్రాంతంలో ఐదారుగురు మిలిటెంట్లు ఆయుధాలతో సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో భారత భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాలను చూసి మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి.
మిలిటెంట్లు నల్లా సమీపంలోకి కదిలారు. వారిని భద్రతా బలగాలు వెంబడించాయి. మిలిటెంట్లు హాఫ్రూదా అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. దీంతో భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.












Click it and Unblock the Notifications