పట్టాలు తప్పిన బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్

చెన్నై: బెంగళూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మూడు బోగీలలోని ప్రయాణికులు దేవుడా అంటు ఊపిరిపీల్చుకుని రైలు దిగారు. రైలు బయలుదేరడం ఆలస్యం అయినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

బుధవారం వేకువ జామున 4.25 గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బెంగళూరు-చెన్నయ్ ఎక్సె ప్రెస్ రైలు బయలుదేరింది. రైలు బయలుదేరి రెండు కిలో మీటర్ల దూరం వెళ్లింది. తరువాత రైలు క్రాసింగ్ కోసం చిన్నగా వెళుతున్నది.

 Three coaches of Bangalore-Chennai Mail derailed near Basin Bridge

బేసిన్ బ్రిడ్జ్ సమీపంలోని చిన్న మలుపులో రైలు చివరి మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లిపోయాయి. ఆ సమయంలో రైలు వేగం చాల తక్కువగా ఉండటంతో వెంటనే అప్రమత్తం అయిన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. ఆందోళన చెందిన ప్రయాణికులు కిందకు దిగారు.

విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన బోగీలను మళ్లి పట్టాల మీదకు తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదం వలన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రైళ్లు, అక్కడికి చేరుకునే రైళ్ల సంచారంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+