Students: ప్రాణం తీసిన పార్ట్ టైమ్ జాబ్ లు, కాలేజ్ విద్యార్థు మీద బస్సు నడిపిన డ్రైవర్ !

బెంగళూరు/బళ్లారి: పేదరికంతో బాదపడుతున్న విద్యార్థులు హాస్టల్ లో చదువుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం కాలేజ్ కు వెళ్లి సాయంత్రం హాస్టల్ కు వెలుతున్నారు. కాలేజ్ లో సాటి విద్యార్థులతో సంతోషంగా ఉంటున్నారు. పార్ట్ టైమ్ జాబ్ చేసి రాత్రి హాస్టల్ కు వెలుతున్న ముగ్గురు విద్యార్థుల మీద వేగంగా వెలుతున్న బస్సు దూసుకుపోవడంతో ముగ్గురు చనిపోయారు.

కర్ణాటకలోని బళ్లారిలోని హాస్టల్ లో కనకరాజు శంకర్, హోన్నూరు స్వామి అనే విద్యార్థులు ఉంటున్నారు. బళ్లారిలోని ఓ కాలేజ్ లో కనకకరాజు, శంకర్ ఇంటర్ చదువుకుంటున్నారు. హోన్నూరు స్వామి బళ్లారిలోనే డిగ్రీ చదువుకుంటున్నారు. పేదరికం కారణంగా ముగ్గురు విద్యార్థులు హాస్టల్ లో ఉంటున్నారు.

Three college students died in a road accident due to negligence of the driver in Ballari.

కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఇప్పించుకుని వెళ్లి కాలేజ్ అయిన తరువాత బయట ఎంజాయ్ చేస్తున్నారు. కనకరాజ్, శంకర్, హోన్నూరు స్వామి వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తెప్పించుకుని స్థోమతలేకపోవడంతో స్నేహితులకు ఏమాత్రం డబ్బు ఖర్చు చెయ్యలేకపోయారు.

కాలేజ్ పూర్తి అయిన తరువాత ముగ్గురు పార్ట్ టైమ్ జాబ్ చెయ్యడం మొదలుపెట్టారు. వివాహాలు జరిగుతున్న కల్యాణ మంపడపంలో భోజనాలు వడ్డించే పనులు చేస్తున్న శంకర్, కనకరాజ్, హోన్నూరు స్వామి ఏదో కొంత డబ్బులు సంపాధించుకుని కుటుంబ సభ్యులకు కష్టం కలిగించకుండా కాలేజ్ కు వెళ్లి వచ్చే సమయంలో ఖర్చు చేసుకుంటున్నారు.

ఆదివారం రాత్రి బళ్లారి సమీపంలోని హోలకుంది గ్రామంలో జరిగిన పెళ్లిలో ముగ్గురు విద్యార్థులు భోజనాలు వడ్డించారు. అర్దరాత్రి పెళ్లిలో భోజనం చేసుకుని వారు ఇచ్చిన డబ్బులు తీసుకుని బళ్లారిలోని హాస్టల్ కు బయలుదేరారు. ఆ సందర్బంలో వేగంగా వెళ్లిన బస్సు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెలుతున్న విద్యార్థుల మీద దూసుకుపోయింది ఈ ప్రమాదంలో కాలేజ్ విద్యార్థులు కనకరాజ్, శంకర్, హోన్నూరు స్వామి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+