ఉగ్రవాదుల దాడులు: ముగ్గురు పోలీసుల కాల్చివేత
శ్రీనగర్: విధులలో ఉన్న ముగ్గురు పోలీసులను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. సోమవారం మధ్యాహ్నం జమ్మూలోని షోపియన్ జిల్లాలోని ఆషిపూర గ్రామంలో ఒక క్రైం కేసుకు సంబంధించి విచారణ చేసేందుకు ముగ్గురు కానిస్టేబుల్స్ వెళ్లారు. వారిలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు.
అదే సమయంలో గ్రామం శివర్లాలో మకాం వేసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులు జరపడానికి ముగ్గురు పోలీసుల వద్ద ఒక్క తుపాకీ లేదు. ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో ముగ్గురు పోలీసులు సంఘటనా స్థలంలో మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఒక గంట ముందు ఎస్ఐ మీద కాల్పులు!

విధులకు వెళ్తున్న పోలీసు అధికారి మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. సోమవారం మద్యాహ్నం 1.10 గంటల సమయంలో జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని పట్టాన్ ప్రాంతం నుండి బస్సు బయలుదేరింది.
ఇదే బస్సలులో సబ్ ఇన్స్ పెక్టర్ గులామ్ ముస్తఫా ప్రయాణించారు. బస్సు కిలోమీటరు దూరం వెళ్లాక ఉగ్రవాదులు రెండు పిస్తోల్లతో బస్సులో ఉన్న గులామ్ ముస్తఫా మీద కాల్పులు జరిపారు. ఆ సమయంలో గులామ్ ముస్తఫా తప్పించుకొవడానికి ప్రయత్నించారు.
ఉగ్రవాదులు గులామ్ ముస్తఫాను అంతం చెయ్యడానికి విఫలయత్నం చేశారు. డ్రైవర్ బస్సును చాకచక్యంగా నడిపి ఉగ్రవాదులు దాడుల నుండి తప్పించారు. తీవ్రగాయాలైన సబ్ ఇన్స్ పెక్టర్ గులామ్ ముస్తఫా ను డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు.
వైద్యులు గులామ్ ముస్తఫా శరీరంలో ఉన్న బుల్లెట్లు బయటకు తీశారు. గులామ్ ముస్తఫా కోలుకోంటున్నారని పోలీసులు చెప్పారు. అయితే దాడులకు తామే భాద్యత వహిస్తున్నామని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని పోలీసు అధికారులు తెలిపారు.
కొండచరియలు విరిగి తెలంగాణ రాష్ట్ర జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్లో ఆదివారం నాడు కొండచరియలు విరిగిపడి తెలంగాణ రాష్ట్రానికి చెందిన జవాను మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌కు చెందిన శివశంకర్ ఈ ఘటనలో మృతి చెందాడు. శివశంకర్ మృతదేహం సోమవారం సాయంత్రం షాద్ నగర్ చేరుకోనుంది.












Click it and Unblock the Notifications