హత్రాస్ బాధిత కుటుంబానికి మూడంచెల రక్షణా వ్యవస్థ .. సుప్రీంకు వివరణ ఇచ్చిన యూపీ సర్కార్
హత్రాస్ దళిత యువతి సామూహిక హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షులకు మూడంచెల రక్షణా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దర్యాప్తుపై 15 రోజుల స్టేటస్ రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని సిబిఐని కోర్టు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసు గురించి ఫేక్ వార్తలు వ్యాప్తి చెందుతున్నాయనే కారణంతో, యూపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువగా మారిన కారణంగా దర్యాప్తును సిబిఐకి సూచించటంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం ముందు సుముఖత వ్యక్తం చేసింది.

సీబీఐ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన యూపీ సర్కార్
హత్రాస్ ఘటనపై సిబిఐ నిర్ణీత సమయంలో విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని విన్నవించిన ఉత్తరప్రదేశ్ సర్కార్, ఆ నివేదికను యూపీ ప్రభుత్వానికి అందించేలా ఆదేశించాలని కోరింది. అంతేకాదు క్రమం తప్పకుండా ఉత్తరప్రదేశ్ డిజిపి ఆ నివేదికను సుప్రీంకోర్టు సమర్పిస్తారని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో న్యాయ దర్యాప్తును నిర్వహించటానికి బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు పూర్తి భద్రత కల్పించడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని పేర్కొంది .

హత్రాస్ బాధిత కుటుంబానికి 16మంది సిబ్బందితో మూడంచెల రక్షణ
బాధిత యువతి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, ఒక బావ మరియు ఆమె అమ్మమ్మ హత్రాస్ జిల్లాలోని చందపా గ్రామంలో నివసిస్తున్నారు.వారి భద్రత కోసం తగిన బలగాలను ఏర్పాటు చేశామని ఉన్నత కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తెలిపింది.బాధితురాలి కుటుంబ సభ్యులు మరియు సాక్షులకు అందించిన రక్షణ మరియు భద్రత వివరాలను తెలియజేస్తూ, ఆమె ఇంటి సమీపంలో మరియు వెలుపల 16 మంది వరకు సాయుధ పోలీసులు కాపలా నిర్వహిస్తారని, మూడంచెల రక్షణ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది .ఎనిమిది సిసిటివి కెమెరాలు ఉన్నాయని వారి ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేశామని చెప్పింది .

హత్రాస్ ఎంట్రన్స్ లో కూడా పోలీసుల బందోబస్తు
ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌ను విన్నసుప్రీం ధర్మాసనం హత్రాస్ సంఘటనను భయంకరమైన సంఘటనగా పేర్కొంది సుప్రీం కోర్టు. అక్టోబర్ 6 న కోర్టు ఆదేశాలకు అనుగుణంగా యూపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది . బాధిత యువతి కుటుంబ సభ్యులను ,సాక్షులను రక్షించడానికి తీసుకున్న చర్యల గురించి తెలియజేయమని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. బాధితురాలి గ్రామ ఎంట్రన్స్ లో , ఆమె ఇంటి సమీపంలో, ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరియు నలుగురు లేడీ కానిస్టేబుళ్ళతో సహా మొత్తం 16 మంది పోలీసు సిబ్బంది ఉంటారని స్పష్టం చేసింది.
Recommended Video

వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగనివ్వం అన్న యూపీ సర్కార్
అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కోవడానికి ముందస్తు భద్రతలో భాగంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు యోగి ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు సాక్షుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎటువంటి పరిస్థితిలోనూ జోక్యం చేసుకోబోమని, ఇక ఇదే విషయాన్ని అక్కడ విధులు నిర్వర్తించే పోలీసులకు కూడా చెప్పామని కోర్టుకు తెలిపింది. వారి స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామని, ఎలాంటి ఆటంకాలను ప్రభుత్వం వైపు నుంచి కల్పించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications