దొంగతనం నెపంతో మహిళపై రేప్, చిత్రహింసలు

బాధిత మహిళ(32) తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనం నేరం మోపిన ఆమె ఇంటి యజమాని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లోని ఇద్దరు మహిళలు ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు విచారణాధికారి ఎస్ బందోపాధ్యాయ్ మంగళవారం మీడియాకు తెలిపారు.
మండుతున్న ఓ ఇనుప కడ్డీతో తనపై యజమాని కుటుంబసభ్యులు వాతలు పెట్టారని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
తాను యజమాని ఇంట్లో నగదు గానీ, చేతి గడియారం గానీ దొంగతనం చేయలేదని బాధితురాలు వాపోయింది. ఎలాంటి దొంగతనం చేయనప్పటికీ తనపై నేరంమోపి యజమాని కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురిచేయగా.. తన యజమాని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది.












Click it and Unblock the Notifications