ఘోర పడవ ప్రమాదం: ముగ్గురు మృతి, 26మంది గల్లంతు

గౌహతి: అస్సాం రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రహ్మపుత్ర నదిలో పడవ మునిగి ముగ్గురు చనిపోయారు. మరో 26 మంది గల్లంతయ్యారు. మిగితా వారు ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గౌహతి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పడవలో సుమారు 45 మంది ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నది ఒడ్డుకు 200 మీటర్ల దూరంలో పడవ మునిగిపోయిందని చెప్పారు. గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పడవలో మహిళలతోపాటు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.

Three Killed as Boat With Nearly 26 People Capsizes in Brahmaputra

అస్సాం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి శర్భానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయని చెప్పారు. మృతి చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+