తుపాకీల మోతతో దద్దరిల్లుతున్న జమ్మూకాశ్మీర్: షోపియాన్ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం!!

జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఆగటం లేదు. జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి, దేశంలో హింసకు, చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పహారా ముమ్మరం చేసి, అనుమానిత ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు చేస్తూ ఉగ్రవాదుల ఏరివేత చేపట్టాయి.

తాజాగా జమ్ము కాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గం ప్రాంతంలో ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో వారికి తారసపడిన ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎన్కౌంటర్ చోటుచేసుకోగా ముగ్గురు మృతి చెందారు.

Three Lashkar-e-Taiba terrorists killed in encounter in shopian area in jammu kashmir

మహిళలు మరియు పిల్లలు, నిరాయుధులైన పోలీసులు, వలస కార్మికులతో సహా అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్న వారిని మట్టు పెడుతున్న భద్రతా బలగాలు ఈ క్రమంలోనే ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను హతమార్చారు. ఈ సందర్భంగా కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ లోయలో శాంతిని నెలకొల్పడానికి మేము చేస్తున్న ప్రయత్నాలను ఉగ్రవాదులు అడ్డుకోలేరన్నారు. కాశ్మీర్‌లోని 3 ప్రాంతాలలో ప్రత్యేకంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఇతర దేశాల ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మా కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలు ఏకకాలంలో కొనసాగుతాయని వెల్లడించారు.

షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ లో మృతి చెందిన మృతులలో ఇద్దరిని అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులలో ఒకడిని షోపియాన్ కు చెందిన లతీఫ్ లోనేగా గుర్తించగా, మరొకటి అనంత నాగ్ కు చెందిన ఉమర్ నజీర్ గా గుర్తించారు. లతీఫ్ లోనే కు కాశ్మీరీ పండిట్ పురానా కృష్ణ భట్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక ఉమర్ నజీర్ కు నేపాల్ కు చెందిన తిల్ బహదూర్ ధాపా హత్య కేసు నిందితుడని జమ్మూకాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. నిందితుల వద్ద నుండి ఏకే 47 తుపాకీ తో పాటు రెండు పిస్టల్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+