ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన జవాన్లు: ఆ తీవ్రవాద సంస్థకు వెన్ను విరిగినట్టే: 5 గంటలుగా.. !
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట నుంచి ఏకధాటిగా సంభవించిన ఎదురు కాల్పుల సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఏకే-47, ఏకే-56, తుపాకులు, హ్యాండ్ గ్రనేడ్లు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో జహంగీర్ రఫిక్ వణి, రజా ఉమర్ మక్బూల్, ఉజైర్ అమీన్ బట్ అనే ఉగ్రవాదులు హతమైనట్లు ధృవీకించారు. ఈ ముగ్గురూ అన్సర్ ఘజ్వా ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలో పని చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ సంస్థ జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రంగా చేసుకుని తరచూ ఉగ్రవాద దాడులకు పాల్పడుతోందని, ఇదివరకు కొందరు స్థానికులు, పోలీసులను కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

త్రాల్ సెక్టార్ పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్‌ను నిర్వహిస్తుండగా.. ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలోఈ ముగ్గరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరి కొంతమంది ఉండొచ్చనే అనుమానంతో త్రాల్ సెక్టార్‌ను జల్లెడ పడుతున్నారు.
Recommended Video

-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications