ముగ్గురు అమ్మాయిలపై ఏడుగురు దాడి, గ్యాంగ్ రేప్

పొరుగు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారంనాడు పొలంలో ఈవ్ టిజింగ్‌కు దిగారు. అమ్మాయిలు వ్యతిరేకించడంతో మరో నలుగురు యువకులు వచ్చి చేరారు. ఆ ఏడుగురు కలిసి అమ్మాయిలను కొట్టి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఓ అమ్మాయి సోదరుడు ఎదిరించడానికి వెళ్లగా వాళ్లు అతన్ని కూడా కొట్టారు. ఏడుగురిపై జరీఫ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈవ్ టీజింగ్, ఎస్సీఎస్టీ చట్టం కింద పోలీసులు కేసులు పెట్టారు. అయితే, తమపై సామూహిక అత్యాచారం జరిగిందని అమ్మాయిలు ఆరోపించారు.
అమ్మాయిల కుటుంబ సభ్యులు ఎస్ఎస్‌పి ఎల్ఆర్ కుమార్‌ను కలిసి పోలీసులు నిందితులను కాపాడుతున్నారని ఫిర్యాదు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత జోక్యం చేసుకుని సామూహిక అత్యాచారం కింద కేసు పెట్టకుండా అడ్డుకున్నాడని వారు ఆరోపించారు.
ఈవ్ టీజింగ్ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, బాధితులు సామూహిక అత్యాచారం జరిగిందని చెబుతున్నారని, అందువల్ల అమ్మాయిల వాంగ్మూలాలను కోర్టులో రికార్డు చేస్తామని, తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్‌పి చెప్పారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications