తండ్రీకొడుకులను కాల్చి చంపినవారిని కొట్టి చంపారు
పాట్నా: తండ్రీ కొడుకును దారుణంగా కాల్చిచంపిన ముగ్గురు దుండగులను గ్రామస్తులు పట్టుకుని కొట్టి చంపేసిన సంఘటన బీహార్ లోని సీతామారి గ్రామంలో జరిగింది. దోపిడి చెయ్యడానికి వచ్చిన దుండగుల చేతిలో బాలుడు సంఘటనా స్థలంలో అంతం అయ్యాడు.
పోలీసు అధికారుల కథనం మేరకు - సీతామారి గ్రామంలో అవద్ కిశోర్ (35), రత్నేష్ (12) అనే తండ్రి కుమారుడు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి తుపాకీలు చేతపట్టుకున్న దుండగులు గ్రామంలో చొరబడి దోపిడీలు చేశారు. అదే సమయంలో కిశోర్ ఇంటిలోకి చోరబడ్డారు.

కిశోర్ వారిని అడ్డుకున్నాడు. ఆ సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ లు కిశోర్, రత్నేష్ ల శరీరంలోకి దూసుకు వెళ్లాయి. తీవ్రగాయాలైన రత్నేష్ అక్కడే మరణించాడు. విషయం గుర్తించిన గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చేతికి చిక్కిన కర్తలు, రాడ్ లు, వస్తువులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు దుండగుల మీద దాడి చేశారు. దెబ్బలు ఎక్కువ తగలడంతో ముగ్గురు దుండగులు అక్కడే మరణించారు. కిశోర్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై అతను మరణించాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications