జాతరలో అపసృతి: బాల్కనీ కూలి ముగ్గురి మృతి (వీడియో)
బరేలి: సంతోషంగా అందరితో కలిసి జాతర చూస్తున్న సమయంలో ఇంటి బాల్కనీ కుప్పకూలిపోయి ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలోని బైరామ్ గ్రామంలో జరిగింది. ఈ జాతరలో విషాదం చోటు చేసుకోవడంతో జాతర అర్దాంతరంగా నిలిపివేశారు.

బైరామ్ గ్రామంలో గురువారం గ్రామ పెద్దలు ప్రత్యేక జాతర నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లోని వేలాధి మంది ప్రజలు ఈ జాతరకు హాజరైనారు. జాతరలో సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఊరేగింపుగా వెలుతున్నారు.
జాతరలోని సాంసృతిక కార్యక్రమాలు చూడటానికి గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న ఇండ్ల మీదకు ఎక్కారు. అయితే నాసిరకంగా ఉన్న ఇంటి బాల్కనీ మీద పదుల సంఖ్యలు గ్రామస్తులు నిలబడటంతో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన 24 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications