Sisters: ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ?, అందమైన అమ్మాయిల శవాలు కుళ్లిపోయి, షాక్ !
బెంగళూరు/తుమకూరు: దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అమ్మాయిల చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు వారి అమ్మమ్మ ఇంటిలో ఉంటూ ఇంతకాలం జీవించారు. అక్కాచెల్లి గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. మరో యువతి ఇంటి దగ్గరే ఉంటున్నది. అందమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు వారు నివాసం ఉంటున్న ఇంటిలో అనుమానాస్పదంగా చనిపోవడం, శవాలు కుళ్లిపోవడం కలకలం రేపింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఒకే ఇంటిలో శవాలైనా అక్కాచెల్లెళ్లు
10 రోజుల క్రితం తల్లిదండ్రులు లేని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే శవాలైనారు. ముగ్గురి మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని
తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా బరకనహల్ తాండా సమీపంలో ఒంటరిగా ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న రంజిత (24), బిందు (21), చందనా (18) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. 10 రోజుల క్రితం అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అందమైన అమ్మాయిలు
అక్కాచెల్లెళ్లు రంజిత, బిందు, చందనా చూడటానికి ఎర్రగా, పొడవుగా చాలా అందంగా ఉంటారు. తల్లిదండ్రులు చనిపోవడంతో అక్కాచెల్లెళ్లు చిన్నప్పుడే బారకనహల్ తండాలో అమ్మమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ పోషణ కోసం రంజిత, బిందు గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. చందనా ఇంటి దగ్గరే ఉంటున్నది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కిబ్బనహళ్లి సమీపంలో గార్మెంట్స్‌లో పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అమ్మాయిల అమ్మమ్మ కూడా అనారోగ్యంతో మరణించింది.

మానసికంగా కుంగిపోయారు
అమ్మమ్మ చనిపోవడంతో అక్కాచెల్లెళ్లు మా జీవితాలు ఇంతేనా అంటూ మానసికంగా కుంగిపోయారని తెలిసింది. తాండా శివార్లలో అక్కాచెల్లెళ్లు ఒంటరి ఇంటిలో నివాసం ఉంటున్నారు. యువతులు నివాసం ఉంటున్న ఇంట్లో వారు ఉన్నారా లేదా అని తాండా వాసులు పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. జీవితంపై విరక్తి చెందిన అక్కాచెల్లెళ్లు రంజిత, బిందు, చందనా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోస్టుమార్టం నివేదికలో ?
యువతులు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. గ్రామస్తులు వెళ్లి చూడగా ఇంట్లో ముగ్గురి మృతదేహాలు వేలాడుతూ కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయని, తరువాత మాకు సమాచారం ఇచ్చారని పోలీసులు అంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించామని, తరువాత అసలు మ్యాటర్ తెలుస్తోందని హుళియూరు పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications