కూలిన మూడంతస్థుల భవనం:తొమ్మిది మంది మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మూడంతస్థుల భవనం కూలింది. ఢిల్లీలోని ఇంద్రలోక్ ప్రాంతంలో ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. శిథిలాల కింద ఆరు కుటుంబాలకు చెందినవారు చిక్కుకున్నట్లు అనుమానించి, 12 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. స్థానికులు మాత్రం ఐదుగురు మరణించినట్లు చెబుతున్నారు.

ఘటనా స్థలికి చేరుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు సహాయక చర్యలు చేపట్టాయి.శిథిలాల కింద చిక్కుకున్నవారిని ఎనిమిది మందిని సహాయక బృందాలు రక్షించాయి.
శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయంపై దృష్టి పెట్టారు. మహిళ మరణించినట్లు తెలుస్తోంది. భవనంలో ఆరు కుటుంబాలు ఉంటాయి. ఇంకా శిథిలాల కింద 15 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రమాదం కార్మికవాడలో జరిగింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితి గందరగోళంగా ఉంది.
కూలిన భవనం చాలా పాతది. పక్కన నిర్మితమవుతున్న కట్డడం కారణంగా ఈ భవనం కూలిపోయిందని భావిస్తున్నారు. ఆ ప్రాంతం అత్యంత ఇరుగ్గా ఉంటుంది. గాయపడినవారిని బారా హిందూ రావు ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications