పహల్గాం దాడి ఉగ్రవాది ఎన్ కౌంటర్ - మరో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ హతం..!!
టెర్రరిస్టులను మట్టిలో కలిపేస్తామని ప్రకటించిన భారత్.. ఆ దిశగా ముందుకు వెళ్తోంది. పహల్గాం దాడి తరువాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తో పాక్ అతలా కుతలం అయింది. పాక్ రక్షణ వ్యవస్థ ఛిన్నా భిన్నంగా మారింది. సింధు నదీ ఒప్పందం రద్దు పైనా పునరాలోచన కోసం పాక్ భారత్ ను అభ్యర్ధించింది. ఇక, జమ్ములో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. 48 గంటల్లో రెండో ఎన్ కౌంటర్ జరిగింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఒక ఉగ్రవాదితో పాటుగా లష్కరే తోయిబాకు చెందిన మరో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో
లష్కరే తయ్యిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పుల్వామా జిల్లా లోని థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీం తో, కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురుకాల్పులతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్ గా మారింది. మరోవైపు, జమ్ముకశ్మీర్‌లో 48 గంటల్లో ఎన్‌కౌంటర్ జరగడం ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్‌పాథర్ కెల్లర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

వీరిని లష్కరే తయ్యిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అయితే దీనికి భద్రతా బలగాలు ఆపరేషన్ కెల్లర్ గా పేరు ఖరారు చేసాయి. టెర్రర్ రహిత ప్రాంతంగా కాశ్మీర్ ను మార్చేందుకు భద్రతా దళాలు ప్రతీ అడుగు శోధిస్తున్నాయి. ఎక్కడా టెర్రర్ మూలాలు ఉన్నా పూర్తిగా నేల మట్టం చేస్తున్నాయి. నిఘా వ్యవస్థతో సమన్వయం చేసుకుంటూ భారత్ దళాలు ఉగ్రవాదుల ఏరి వేతను ముమ్మరం చేసాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications