ఆహారం, నీరు తీసుకోకుండా సల్లేఖన దీక్ష.. మూడేళ్ల చిన్నారి ప్రాణత్యాగం

మూడేళ్ల పిల్లలు అంటే.. సరిగ్గా మాటలు కూడా రాని వయసు. అలాంటి ఓ చిన్నారి సల్లేఖన దీక్ష చేసి మృతి చెందింది. ఈ విషాద ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఆహారం, నీరు తీసుకోకుండా ఆమరణ నిరాహార ఉపవాస దీక్ష చేసి శరీరాన్ని క్షీణింపజేసి ప్రాణాన్ని దేవుడికి అర్పించి మృతి చెందింది. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నిండా మూడేళ్లు కూడా నిండని చిన్నారి వియానా సల్లేఖన దీక్ష చేసి మృతి చెందింది. ఆహారం, నీరు తీసుకోకుండా శరీరాన్ని క్షీణింపజేస్తూ స్వచ్ఛందంగా మరణాన్ని పొందింది. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే.. బ్రెయిన్ ట్యూమర్‌ తో బాధపడుతున్న వియానా తల్లిదండ్రులు ఆమెకు ఈ దీక్షను నిర్వహించారు. దీక్ష ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వియానా ప్రాణాలు కోల్పోయింది.

Three-Year-Old Dies During Sallekhana Fast Without Food or Water

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కు చెందిన పీయూష్, వర్షా జైన్ దంపతుల ఏకైక కుమార్తె వియానా. పీయూష్ ఓ కంపెనీలో టెకీగా పనిచేస్తున్నాడు. గత డిసెంబర్‌లో వియానాకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. మరోవైపు వియానా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం ప్రారంభమైంది.

దీంతో జైన మతాన్ని పాటించే ఆ కుటుంబం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. మార్చి 21న జైన గురువు రాజేష్ ముని మహరాజ్ ఇచ్చిన సలహా మేరకు వియానాకు సల్లేఖన దీక్ష నిర్వహించారు. తమ ఆధ్వర్యంలోనే ఈ దీక్ష జరిగినట్లు వియానా తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీక్ష ప్రారంభించిన కొద్ది సేపటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.

సల్లేఖన దీక్ష అంటే ఏంటి ?

సల్లేఖన దీక్ష అంటే ఆహారం, నీరు వంటికి తాగకుండా ఉపవాసం ద్వారా స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేయడం. సాధారణంగా వృద్ధాప్యం, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు మత గురువు వద్ద ఈ దీక్షను తీసుకుంటారు. దీక్ష తీసుకున్న వ్యక్తి ఆహార పానీయాలను మానేస్తారు. సల్లేఖన దీక్ష ద్వారా వచ్చే మరణాన్ని సమాధి మరణం, శాంతియుత మరణం అని కూడా అంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+