అయ్యో పాపం: ఉడుకుతున్న కూరగాయల పాత్రలో పడి మూడేళ్ల చిన్నారి మృతి, నిర్లక్ష్యంతోనే..!

మీర్జాపూర్: ఉత్తర్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. మీర్జాపూర్ జిల్లాలోని ఓ స్కూలులో అప్పుడే వండిన ఆహారంలో మూడేళ్ల పాప పడిపోయింది. ఆహారం వేడిగా ఉండటంతో పాప శరీరం పూర్తిగా కాలిపోయింది. తీవ్రగాయాలు పాలైన చిన్నారి మృతి చెందింది. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతోనే పాప మృతి చెందిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా పాఠశాలలో మధ్యాహ్న భోజనం సందర్భంగా కూరగాయలను ఓ పెద్ద పాత్రలో ఉడకబెట్టారు. కూరగాయలు ఉడుకుతున్న సమయంలో వంట చేసేవారు హెడ్‌ ఫోన్స్ పెట్టుకున్నారు. స్టవ్‌కు దగ్గరలోనే పిల్లలు ఆడుతుండటాన్ని వారు గమనించలేదు. చూసినప్పటికి కూడా వారిని వారించే ప్రయత్నం చేయలేదని మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇలా ఆడుకుంటూ వచ్చిన ఆ మూడేళ్ల చిన్నారి వరండా పై నుంచి కింద ఉడుకుతున్న కూరగాయల పాత్రలోకి పడిపోయింది. ఆ సమయంలో వంట చేసే సిబ్బంది హెడ్‌ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో చిన్నారి పడిన విషయాన్ని గమనించలేదు.

Three years girl fall into a boiling pot of vegetables in Mirzapur School dies

ఇక చిన్నారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై తీవ్రంగా స్పందించిన జిల్లా కలెక్టర్ స్కూలు హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేశారు. అదే స్కూలులో చిన్నారి ఇద్దరి సోదరులు కూడా చదువుతున్నారు. అయితే చిన్నారి కూరగాయలు ఉడుకుతున్న పాత్రంలో పడిపోవడాన్ని వంట సిబ్బంది గమనించలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

వంట సిబ్బంది ఫోనులో మాట్లాడుతూ ఇది గమనించలేదని తండ్రి చెప్పాడు. చిన్నారి ఉడుకుతున్న కూరగాయల పాత్రలోకి పడిపోవడాన్ని ఆమె గమనించలేదని వెల్లడించాడు. ఇక ఇతర పిల్లలు గట్టిగా కేకలు వేసి అక్కడి నుంచి పరుగులు తీయడంతో.. వంట మనిషి కూడా భయంతో పరుగులు తీసిందని చిన్నారి తండ్రి చెప్పాడు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని చెప్పిన ఆయన... స్కూలులో ఆరుమంది వంట మనుషులు ఉండగా.. ఈ ఘటన కేవలం వారి నిర్లక్ష్యం వల్లే జరిగిందని కలెక్టర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+