'సెకండ్ షో'కు వెళ్లిన జంటకు షాక్: బాత్‌రూమ్‌లో దూరి.. వీడియో తీసేందుకు యత్నం!

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: కుటుంబంతో కలిసి సరదాగా సెకండ్ షోకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పేరుకు క్లాస్ మల్టీప్లెక్స్ అయినా భద్రత విషయంలో మాత్రం వట్టి డొల్ల అని తేలింది. సినిమా పూర్తయిన అనంతరం టాయ్ లెట్స్ కు వెళ్లగా.. పలువురు యువకులు బాత్ రూమ్ లో ఉండటంతో మహిళలు బయటకు పరిగెత్తారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ జంట నగరంలో దుస్తుల వ్యాపారం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన నగరంలోని చిత్రాల మల్టీప్లెక్స్ లో సెకండ్ షో(అర్థరాత్రి) సినిమా చూడటానికి వెళ్లారు. సినిమా అయిపోయిన తర్వాత మహిళ టాయ్ లెట్ కు వెళ్లింది. అయితే అప్పటికే ముగ్గురు యువకులు అందులో ఉండటం గమనించి కేకలు వేస్తూ బయటకు వచ్చింది.

Three young men held for offensive behaviour with women in multiplex toilets

ఆ మహిళతో పాటు మరికొందరు మహిళలు కూడా టాయ్ లెట్ నుంచి కేకలు వేస్తూ బయటకొచ్చారు. విషయం తెలిసిన థియేటర్ సిబ్బంది ఆ ముగ్గురు యువకులను పట్టుకున్నారు. పట్టుబడ్డ యువకులతో పాటు, టాయ్ లెట్ బయట ఉన్న మరో ముగ్గురికి దేహశుద్ది చేశారు. యువకులను మధ్యప్రదేశ్ కు చెందినవారుగా గుర్తించారు.

సదరు జంట ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను మధ్యప్రదేశ్ కు చెందిన అబ్దుల్లా, దినేష్, మహ్మద్, అన్వర్ లుగా గుర్తించామని వెల్లడించారు. టాయ్ లెట్ లో మహిళల వీడియోలు చిత్రీకరించేందుకే వీరు దూరి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police held three accused in Vizianagaram, who were entered into women toilets secretly. Victims alleged that three were tried to video record of toilet scenes
Please Wait while comments are loading...