నేషనల్ పార్కులో దారుణం: చిన్నారిని చంపేసిన పులి

పాట్నా: మరో పార్కులో దారుణం జరిగింది. ఓ ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసి చంపేసింది. ఈ సంఘటన బీహార్‌ని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెరిహండీ గ్రామ సమీపంలోగల వాల్మీకి నేషనల్ పార్క్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ మేరకు వివరాలను ఉన్నతాధికారులు వెల్లడించారు.

నేషనల్ పార్క్ సమీపంలోని గ్రామ పరిధిలో బబ్లూ అనే చిన్నారి ఆటలాడుకుంటున్నాడు. ఆ క్రమంలో బబ్లూపై పులి ఆకస్మాత్తుగా దాడి చేసి చంపేసింది. అనంతరం అతడి శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా చిన్నాభిన్నం చేసింది. దీంతో గ్రామస్తులు, పార మిలటరీ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 Tiger kills five-year-old in Bihar national park

కాగా, వాల్మీకి నేషనల్ పార్క్‌లో పులుల సంఖ్య గత మూడేళ్ల కాలవ్యవధిలో రెండింతలు అయ్యాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్క్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.

ప్రభుత్వ విధానం ప్రకారం మృతి చెందిన బబ్లూ కుటుంబానికి రూ. 2 లక్షలు నష్ట పరిహారం అందజేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో న్యూఢిల్లీలోని ఓ పార్కులో పులి దాడిలో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+