‘మనుషులను శిక్షించినప్పుడు.. ఆవులను తినే పులులను కూడా శిక్షించాలి’

పనాజీ: మనుషలను శిక్షించినప్పుడు.. ఆవులను తినే పులులను కూడా శిక్షించాల్సిందేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన గోవా అసెంబ్లీ సమావేశంలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

నెల రోజుల క్రితం మహాదాయి వైల్డ్‌లైఫ్ శాంక్షుయరీలో ఓ పులి, దాని మూడు పిల్లలను స్థానికులు చంపేశారు. ఓ రైతు ఇంట్లోని ఆవును పులి చంపి తినడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఓ పులి, దాని మూడు పిల్లలను చంపేయడం జరిగింది. కాగా, బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, విపక్ష నేత దిగంబర్ కామత్ ఈ విషయాన్ని లేవనెత్తారు.

 Tigers must be punished for eating cows: Goa NCP MLA Churchill Alemao

సభలో అటెన్షన్ మోషన్‌కు పట్టుబట్టారు. దీనిపై స్పందించిన సీఎం ప్రమోద్ సావంత్.. పులులు తమ ఇళ్లపై దాడి చేయడంతో ప్రజలు వాటిని చంపారని అన్నారు. తమ ఆవులను కోల్పోయిన రైతులకు త్వరలోనే నష్ట పరిహారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

కాగా, వన్య జీవుల కోణంలో చూస్తే పులులు ఎంత ముఖ్యమో.. రైతులకు ఆవులు కూడా అంతే ముఖ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చర్చిల్ వ్యాఖ్యానించారు. ఆవుల్ని చంపి తింటే మనుషులకు శిక్ష వేసినప్పుడు అదే పని చసిన పులులకు ఎలాంటి శిక్ష వేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+