మద్యం మత్తులో కొట్టుకున్న జైలు సిబ్బంది(వీడియో)
న్యూఢిల్లీ: జైలులో ఉన్న ఖైదీలను 24గంటలు అప్రమత్తంగా ఉండి చూసుకోవాల్సిన జైలు సిబ్బంది.. తమ బాధ్యతను మరిచి మద్యం మత్తులో ఊగిపోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ తమ ఉద్యోగాలు ఊడిపోయేలా చేసుకున్నారు. ఈ ఘటన ప్రముఖ ఖైదీలుండే తీహార్ జైలులో చోటు చేసుకోవడం గమనార్హం.
కాగా, వీరు మందేసి దాడులు చేసుకున్న తతంగమంతా జైలులోని సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యింది. అంతేకాకుండా అక్కడున్నవారు కూడా కొందరు ఈ ఘటననంతటినీ తమ మొబైల్ ఫోన్‌లలో చిత్రీకరించారు.
ఆ వీడియో కాస్తా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీంతో ఆ వీడియోని పరిశీలించిన ఉన్నతాధికారులు ఆ ఇద్దరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ సిబ్బందిని విధుల నుంచి తొలగించే అవకాశం లేకపోలేదని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications