సరదా కొంప ముంచింది.. నర్సుల ఉద్యోగాలకు ఎసరు తెచ్చిన టిక్ టాక్ (వీడియో)

భువనేశ్వర్‌ : సోషల్ మీడియా క్రేజ్ అంతా ఇంతా కాదు. పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్లు పట్టుకుని యువతీయువకులు తెగ హడావిడి చేస్తున్నారు. ఇక కొన్ని యాప్‌లు వినోదం పేరిట యువతను ఆకట్టుకుంటూ వారిని 24 గంటల పాటు తమ అప్లికేషన్స్‌కు అడిక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఆ క్రమంలో టిక్ టాక్ యాప్‌‌కు యూత్ బానిసవుతోంది. అదలావుంటే కొందరు రూపొందించిన వీడియోలు సందేశాత్మకంగా ఉంటే.. మరికొందరు తయారుచేసే వీడియోలు పరమచెత్తతో నిండిపోతున్నాయి.

ఇక టిక్ టాక్ వీడియోలు తెచ్చిపెడుతున్న తంటాలు కూడా అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఒడిషాలోని ఓ ఆసుపత్రిలో పనిచేసే నర్సులు రూపొందించిన టిక్ టాక్ వీడియో వారి ఉద్యోగాలకు ఎసరు తెచ్చేలా ఉంది. దాంతో ఆ వీడియో ఎందుకు చేశామోనని ఆ నర్సులు తెగ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

TikTok video of nurses in Odisha hospital go viral Inquiry begins May Face Action

మల్కాన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో న్యూ బేబి బార్న్ వార్డులో పనిచేసే నర్సులు కొందరికి ఎక్కడా లేని ఆలోచన వచ్చింది. అలా టిక్ టాక్‌లో వీడియో తీస్తే బాగా పేరొస్తుందని భావించి ఆ మేరకు వారి దగ్గరున్న ఫోన్లతోనే షూటింగ్ చేశారు. నర్సింగ్ డ్రెస్‌లోనే వీడియో రూపొందించి టిక్ టాక్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. బాలీవుడ్ పాటలు, ఫన్నీ డైలాగులకు హావభావాలు పలికిస్తూ సరదా వీడియో రూపొందించారు.

ఏదో సరదాగా తీసిన వీడియో తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందని వారు ఏమాత్రం ఊహించలేదు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో జిల్లా వైద్యాధికారి దృష్టికి వెళ్లింది. దాంతో ఆ నర్సులు విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. విచారణకు ఆదేశించడంతో పాటు సదరు నర్సులకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారట. అదలావుంటే ఎరక్కపోయి ఇరుక్కుపోయామని ఆ నర్సులు ఇప్పుడు తెగ బాధపడుతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+