వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Indigo: రన్ వే పై నుంచి జారీ బురదలో చిక్కుకున్న విమానం టైర్లు.. పైలట్ ఏం చేశాడంటే..

|
Google Oneindia TeluguNews

టేకాఫ్ సమయంలో ఇండిగో విమానం టైర్లు రన్ వే నుంచి పక్కకు జారాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. గురువారం అస్సాంలోని జోర్హాట్ నుండి కోల్‌కతాకు ఇండిగో విమానం టైర్లు టేకాఫ్ సమయంలో రన్‌వే నుంచి జారిపడి బురదలో చిక్కుకున్నాయి. విమానాన్ని నిలిపి వేసి ప్రయాణికులను కిందికి దించారు.

బురదలోకి వెళ్లిన టైర్లు..

బురదలోకి వెళ్లిన టైర్లు..

రన్‌వేపై టేకాఫ్ కోసం ట్యాక్సీ చేస్తున్నప్పుడు, విమానం టైర్లు టార్మాక్‌పై నుంచి పక్కకు వెళ్లి రన్‌వే పక్కనే ఉన్న పొలంలో మెత్తటి బురదలో కూరుకుపోయిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. "జోర్హాట్ నుంచి కోల్‌కతాకు నడుపుతున్న ఇండిగో ఫ్లైట్ 6E-757 తిరిగి బేకి తిరిగి వచ్చింది. టేకాఫ్ సమయంలో విమానం టైర్లు రన్ వే పై నుంచి జారీ బురదలోకి వెళ్లాయి. వెంటన గుర్తించిన పైలట్‌ ఫ్లైట్ ను ఆపాడు" అని ఇండిగో తెలిపింది.

ట్విట్టర్ లో ఫొటో..

ట్విట్టర్ లో ఫొటో..

స్థానిక జర్నలిస్ట్ ట్విటర్‌లో ఒక విమానం టైర్లు బురదలో చిక్కుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఇండిగోను ట్యాగ్ చేస్తూ "గౌహతి కోల్‌కతా ఇండిగో ఫ్లైట్ 6F 757 (6E757) అస్సాంలోని జోర్హాట్ విమానాశ్రయంలో రన్‌వే నుండి జారిపోయి బురదలో చిక్కుకుంది. విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరాల్సి ఉంది" అని పేర్కొన్నాడు.

విమానాల్లో సాంకేతిక లోపాలు..

ఈ మధ్య పలు విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పైస్‌జెట్‌, ఇండిగో విమానాల్లో ఈ లోపాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళ చెందుతున్నారు.విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై డీజీసీఏ చర్యలు చేపట్టింది. బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలని ఎయిలైన్స్ లను ఆదేశించింది.

English summary
An IndiGo flight from Assam's Jorhat to Kolkata on Thursday was cancelled after the aircraft skidded off the runway during take-off and a pair of its wheels got stuck in the muddy outfield.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X