వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Titanic: సముద్ర గర్భంలో ఉన్న ఈ ఓడను చూసేందుకు టూర్ వేయొచ్చు, టికెట్ ధర ఎంతంటే?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టైటానిక్

సముద్రం అడుగున ఉండే టైటానిక్‌ను చూడటం అనేది చాలామందికి ఒక కల లాంటిది. అయితే నేడు ఆ కలను నిజం చేసుకోవచ్చు. పేయింగ్ అడ్వెంచరర్స్ ''మిషన్ స్పెషలిస్ట్స్’’ ద్వారా 112 సంవత్సరాల కిందట మునిగి ఈ ఓడను దగ్గరగా చూడవచ్చు..

కెనడా న్యూఫౌండ్‌ల్యాండ్‌కు నాలుగు వందల మైళ్ల దూరంలోని ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఒక భారీ నౌక వేగంగా ముందుకు వెళ్తోంది. దీనిలో ప్రయాణిస్తున్న స్టాక్టన్ రష్‌కు మనసులో చాలా ప్రణాళికలు ఉన్నాయి.

''భవిష్యత్‌లో అంతరిక్ష పర్యటనలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. సముద్ర గర్భ పర్యటనలూ ఇలానే ప్రజలకు చేరవయ్యే రోజు వస్తుంది’’ అని ఆయన అన్నారు.

ఆయన కంపెనీ ''ఓషన్‌గేట్’’ సముద్భ గర్భంలోని విశేషాలను ప్రజలకు చూపించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈలాన్ మస్క్, రిచర్డ్ బ్రాస్నన్ , జెఫ్ బెజోస్ లాంటి వారు అంతరిక్ష వాణిజ్య పర్యటనలకు వ్యూహాలు రచిస్తున్నట్లే సముద్ర గర్భంలో పర్యటనలకు ఈ సంస్థ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. డబ్బులు ఉంటే చాలు, పెద్దగా నైపుణ్యాలు లేకపోయినా ఈ పర్యటనలకు వెళ్లొచ్చు.

ఉత్తర అట్లాంటిక్‌లో రష్ ఇప్పుడున్న చోట చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడే చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. ఉపరితలానికి 3,800 మీటర్ల అడుగున టైటానిక్ శిథిలాలు ఉన్నాయి. 1912, ఏప్రిల్‌లో ఇక్కడే టైటానిక్ మునిగిపోయింది.

జేడెన్ పాన్

సముద్ర గర్భంలో వాణిజ్య పర్యటనల కోసం ప్రణాళికలు రచిస్తున్న రష్‌.. ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ''ఇంగ్లిష్‌లో మూడు పదాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో అందరికీ తెలుసని ఒక ఆర్టికల్‌లో చదివాను. అవి ఏమిటంటే.. కోకాకోలా, గాడ్, టైటానిక్’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, రష్ కంపెనీ టైటానిక్ కల నిజం కావాలంటే, మొదట తేలికపాటి పదార్థాలతో ఒక సబ్‌మెర్సిబుల్ అంటే ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాన్ని తయారుచేయాల్సి ఉంటుంది. టైటానిక్ ఉన్న లోతుకు కనీసం ఒకసారికి ఐదుగురినైనా ఇది తీసుకెళ్లగలిగేలా ఉండాలి. కానీ, ఇలాంటి వాహనాలను తయారుచేయడం చాలా కష్టమని అంతా భావించేవారు.

అయితే, అలా తయారుచేసిన వాహనంలో గత ఏడాది రష్ విజయవంతంగా సముద్ర గర్భంలోకి వెళ్లి వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన అదే ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు నౌకలో ఆయన, ఓషన్‌గేట్ సిబ్బంది, శాస్త్రవేత్తలతోపాటు సముద్ర గర్భ ప్రయాణంపై ఆసక్తి కనబరిచే కొంతమంది ఔత్సాహికులు ''మిషన్ స్పెషలిస్ట్స్’’ కూడా ఉన్నారు. ఈ ఔత్సాహికులు ఒక్కొక్కరు టైటానిక్‌ శిథిలాలను చూసేందుకు 250,000 డాలర్లు (సుమారు రూ.2.07 కోట్లు) చెల్లించారు.

సముద్ర గర్భంలోని జీవజాతులపై సమాచారం అందించడంతోపాటు అక్కడి ప్రకృతి చిత్రాలు తీయడం, శాస్త్రవేత్తలకు తోడ్పడటం లాంటి అంశాల్లోనూ ఈ పర్యటనలు ఉపయోగపడే అవకాశముంది.

టైటానిక్

బ్యాంకర్ రెనటా రోజాస్, వ్యాపారవేత్త ఓయిసిన్ ఫానింగ్, టీవీ ప్రముఖుడు జేడెన్ పాన్, ఓషనోగ్రాఫర్ స్టీవ్ రోస్, పైలట్ స్కాట్ గ్రిఫిత్‌లు ఒక్కో లక్ష్యంతో ఈ పర్యటనకు వచ్చారు.

''నేను మిలియనీర్‌ను కాదు. అయితే, దీని కోసం ఎప్పటినుంచో డబ్బులు పోగుచేసుకున్నాను. టైటానిక్ చూడటం కోసం నేను చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. కారు కొనుక్కోలేదు. ఇప్పటివరకు పెళ్లి కూడా చేసుకోలేదు. పిల్లలను కనలేదు. ఇవన్నీ టైటానిక్ చూడటం కోసమే’’అని రోజాస్ వివరించారు.

మరోవైపు రోస్‌కు ఈ పర్యటనతో సముద్ర గర్భంలోని టైటానిక్ చుట్టుపక్కల పరిశోధన చేపట్టేందుకు, అక్కడి నీటి నమూనా సేకరించేందుకు మంచి అవకాశం దక్కింది. ''సముద్ర గర్భంలో చాలా విశేషాలు ఉంటాయి. దీని గురించి మనకు అందుబాటులోనున్న సమాచారం చాలా తక్కువ. ఈ సముద్రంలోని మార్పులు ప్రపంచం మొత్తంపైనా ప్రభావం చూపిస్తాయి’’అని రోస్ చెప్పారు.

స్టాక్టన్ రష్‌

కిటికీ లోనుంచి

ఈ సబ్‌మెర్సిబుల్ రెండు గంటలకు పైగా సముద్రం అడుగున గడపడంతో చిన్న కిటికీ లోనుంచి అక్కడి జీవజాతులను రోస్ చూశారు.

''అక్కడ మాకు సముద్రం అడుగున జీవించే క్షీరదాలు కనిపించాయి. ఈ జీవులు రోజూ ఉదయం సముద్రంపైకి వస్తాయి. మళ్లీ 500 నుంచి 1,000 మీటర్ల లోతుకు వెళ్లిపోతాయి. చాలా జీవుల శరీరంపై వెలుగుకు కారణమయ్యే బయోల్యూమినెసెన్స్ పదార్థాలు ఉంటాయి. అంటే వీటి నుంచి వెలుతురు వస్తుంది’’అని ఆయన చెప్పారు.

ఈ సబ్‌మెర్సిబుల్ సముద్రం అడుగున 15 చ.మీ. విస్తీర్ణంలోని టైటానిక్ శిథిలంపై దిగింది. ఇది టైటానిక్ వెనుకభాగం.

''మేం ఐదుగురం అక్కడ కాసేపు మౌనం పాటించాం’’అని పాన్ చెప్పారు. ''అక్కడ మాకు మొదట కొన్ని బొగ్గు ముక్కలు కనిపించాయి. ఒక్కసారిగా ఈ ప్రాంతం మొత్తం నీటిలోకి మునిగిపోతుండటంతో చిన్నచిన్న బోట్ల సాయంతో ప్రజలు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించి ఉండొచ్చు’’అని ఆయన అన్నారు.

టైటానిక్

సమస్య..

అయితే, ఆ తర్వాత సబ్‌మెర్సిబుల్ రెండో చివరన ఉన్న పైలట్ గ్రిఫిత్ ''ఓ.. నో.. మనకు సమస్య వచ్చింది’’అని చెప్పడం పాన్‌కు వినిపించింది.

''నేను థ్రస్టర్స్ సాయంతో ముందుకు కదిలినప్పుడు, ఒక థ్రస్టర్ వెనక్కి ఒరుగుతున్నట్లు అనిపించింది’’అని గ్రిఫిత్ చెప్పారు. ''అప్పుడు మేం కేవలం 360 డిగ్రీల కోణంలో తిరగగలుగుతున్నాం. అంతే’’అని ఆయన వివరించారు. అయితే, ఇది చాలాకష్టమని భావించినట్లు తెలిపారు.

''ఇది సాధ్యంకాకపోవచ్చని నాకు అనించింది. ఎందుకంటే మేం టైటానిక్‌ నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్నాం. మేం కేవలం వలయాకారంలో తిరుగుతున్నాం’’అని రోజాస్ చెప్పారు.

అప్పుడు రష్‌కు అద్భుతమైన ఆలోచ వచ్చింది. ''రెండో వైపు దృష్టిపెట్టమని ఆయనకు చెప్పాను’’అని ఆయన వివరించారు.

కంట్రోలర్‌ను ఎడమవైపుకు తిప్పితే సబ్‌మెర్సిబుల్ ముందుకు కదలొచ్చని ఆయన సూచించారు. దీంతో కంట్రోలర్‌ను సవ్య దిశలో 90 డిగ్రీలకు తిప్పినప్పుడు మళ్లీ అది ముందుకు వెళ్లడం మొదలుపెట్టింది.

రంగురంగుల జీవజాతులను చూసిన వీరు మొత్తానికి తమ లక్ష్యాన్ని పూర్తిచేయగలిగారు. సినిమాలో జాక్, రోస్‌ల మధ్య ప్రేమయణానికి స్ఫూర్తిగా నిలిచిన టైటానిక్‌ను వీరు చూడగలిగారు. అక్కడి సముద్ర అడుగు భాగంలో గంటలపాటు గడిపారు. సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

వీరు సేకరించిన డేటాను విశ్లేషించేందుకు నెలల సమయం పట్టొచ్చు. అయితే, ప్రస్తుతానికి వీరంతా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఆ సబ్‌మెర్సిబుల్ నుంచి నౌకలోకి అడుగుపెడుతూనే రోజాస్ కళ్ల నుంచీ నీరు వచ్చాయి. ''ఈ రోజు నా జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోంది’’అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Titanic: You can take a tour to see this ship in the ocean bed, how much is the ticket price?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X