వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు బహిష్కరణ: టీఎంసీ, సర్దుకున్నారా !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. అందుకే తాము ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధ్యక్షుడు జీకే. వాసన్ చెప్ప

|
Google Oneindia TeluguNews

సేలం/చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధ్యక్షుడు జీకే. వాసన్ అన్నారు. టీఎంసీ పార్టీ పదాధికారులు, నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని జీకే. వాసన్ వివరించారు.

సేలంలోని విజయరాఘవాచారి హాలులో పార్టీ నిర్వహకుల సమావేశం నిర్వహించారు. అనంతరం వాసన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని, ఎవరికీ తాము మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశారు.

TMC leader GK Vasan has announced that his party not to contest in RK Nagar Byelection.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. అందుకే తాము ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వాసన్ చెప్పారు. గతంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించే వారని గుర్తు చేశారు.

అయితే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కోరే పరిస్థితి ఏర్పడిందని వాసన్ విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ న్యాయమైన విధానంతో ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతోందని ప్రజలు కోరుకుంటున్నారని టీఎంసీ పార్టీ అధ్యక్షుడు జీకే. వాసన్ అన్నారు.

English summary
TMC leader GK Vasan has announced that his party not to contest in RK Nagar Byelection 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X