వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీకి షాక్: సీఏఏకు ఆ పార్టీ నేత మద్దతు, ‘ఐదేళ్లు’ వద్దంటూ అమిత్ షాకు లేఖ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెన ర్జీ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఉండగా, ఆ పార్టీకి చెందిన ఓ నేత మాత్రం ఇందుకు మద్దతు పలికారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాకు ఓ లేఖ రాశారు.

ఆ నిబంధనల సవరించండి..

ఆ నిబంధనల సవరించండి..

భారతదేశంలో ఐదేళ్లపాటు తప్పనిసరిగా భారతదేశంలో నివాసం ఉండాలన్న నిబంధనను సవరించాలని టీఎంసీ నేత ఉపేంద్ర నాథ్ కోరారు. కాగా, గత ఫిబ్రవరిలోనే సీఏఏను వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఉపేంద్ర నాథ్ బిస్వాస్.. ఉపెన్ బిస్వాస్‌గా అందరికీ సుపరిచితం. ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) రిటైర్డ్ అడిషనల్ డైరెక్ట్ కూడా. ఇండియన్ పోలీస్ సర్వీస్ 1968 బ్యాచ్‌కు చెందిన బిస్వాస్.. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు జగన్నాథ్ మిశ్రా, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు సంబంధించిన రూ. 950 కోట్ల ఫోడర్ స్కాం దర్యాప్తు చేస్తూ ఆయన వెలుగులోకి వచ్చారు.

ఐదేళ్ల నిబంధన తీసివేస్తే..

ఐదేళ్ల నిబంధన తీసివేస్తే..

‘అవును, నేను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖతో పాటు ఇ-మెయిల్ పంపాను. " భారతదేశంలో ఐదేళ్ల తప్పనిసరి నివాస కాలం "గురించి నిబంధనను తొలగించమని కోరాను. అంతకుముందు, ఇది 11 సంవత్సరాలు, కానీ ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) లోని సెక్షన్ 6 ప్రకారం ఇది ఐదేళ్ళు. కానీ నిబంధనను తొలగించమని నేను అతనిని అభ్యర్థించాను. ఎందుకంటే తక్షణ పౌరసత్వం పొందడంలో ఇప్పుడే తిరిగి రావాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది' అని వ్యాఖ్యానించారు బిస్వాస్.

Recommended Video

Year Ender : దేశ ముఖచిత్రంపై బలమైన నిరసన ముద్ర | Farm Bills | CAA
సీఏఏ సెక్షన్ 6ను సవరించాలి.. బీజేపీ స్వాగతం

సీఏఏ సెక్షన్ 6ను సవరించాలి.. బీజేపీ స్వాగతం

ఇప్పటికే చాలా సంవత్సరాలుగా బెంగాల్‌లో ఉంటున్న ప్రజల పౌరసత్వం గురించి తాను ఏమీ ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. ‘నేను ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి తిరిగి రావాలనుకునే వారిపై మాత్రమే నా ఆందోళనను వ్యక్తం చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న సీఏఏ ప్రకారం, అతను లేదా ఆమె (ఇప్పుడు తిరిగి రావాలనుకునేవారు) పౌరసత్వం పొందటానికి ముందు ఐదేళ్లపాటు ఇక్కడ నివసించాల్సిన అవసరం ఉంది. పౌరసత్వం పొందడానికి అతను లేదా ఆమె ఐదేళ్ళు ఎందుకు వేచి ఉండాల్సి వస్తుందనేది నా ప్రశ్న. అందువల్ల, సీఏఏ సెక్షన్ 6ను సవరించాలని మా కేంద్ర హోంమంత్రిని అభ్యర్థించాను, అని బిస్వాస్ వివరించారు. కాగా, బిస్వాస్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు స్వాగతించారు.

English summary
TMC Leader Upendra Nath Congratulates Amit Shah on Enacting CAA, Urges Him to Ease Rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X