ధూం మచాలే.. ఎంపీ అభినందన సభలో అసభ్య నృత్యాలు.. అభాసుపాలైన లీడర్లు
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభాసుపాలయ్యారు. వేడుకల పేరిట అసభ్య నృత్యాలు చేయిస్తూ పరువు తీసుకున్నారు. దాంతో పశ్చిమ బెంగాల్‌లో అధికార పక్షమైన టీఎంసీకి తలనొప్పులు తప్పడం లేదు. విపక్షాలకు అస్త్రంగా మారడంతో చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు ఎన్నికల నాటి వేడిని మళ్లీ రాజేస్తూ టీఎంసీ లీడర్లను ఆటాడుకుంటున్నారు.
పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీకి ఈ ఎపిసోడ్ తలనొప్పి వ్యవహారంలా తయారైంది. సందట్లో సడేమియాలా కొందరు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టార్గెట్‌గా ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నారు.

పేరుకేమో ఎంపీ అభినందన సభ.. చేసిందేమో రికార్డింగ్ డ్యాన్సులు
టీఎంసీ ఎంపీగా మిమి చక్రవర్తి జాదవ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ మేరకు మంగళవారం (25.06.2019) నాడు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె అనుచరులు, పార్టీ కార్యకర్తలు అభినందన సభ ఏర్పాటు చేశారు. ధూం మచాలే అనుకున్నారో ఏమో గానీ రికార్డింగ్ డ్యాన్సులు చేయించడం రచ్చ రచ్చయింది.

యువకులను రెచ్చగొట్టిన డ్యాన్సర్.. దుస్తులు పైకి లేపుతూ..!
రికార్డింగ్ డ్యాన్స్ చేయడానికి వచ్చిన యువతి అక్కడి యువకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది. చీటికిమాటికీ దుస్తులు పైకి లేపుతూ నానా హంగామా చేసింది. దాంతో ఈలలు, అరుపులతో అభినందన సభ కాస్తా ట్రాక్ తప్పింది. కొందరు యువకులు ఆ తతంగమంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం కాస్తా బయటపడింది. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో విపక్ష నేతలకు అస్త్రం దొరికినట్లైంది. దాంతో టీఎంసీ కార్యకర్తలు క్రమశిక్షణ లేకుండా ఇలా ప్రవర్తిస్తారా అంటూ వీర లెవెల్లో మండిపడుతున్నారు.
అదలావుంటే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశించిన స్థాయిలో లోక్‌సభ ఫలితాలు దక్కలేదు. దాంతో వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ పార్టీ ఎంపీ మిమి చక్రవర్తి అభినందన సభ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమం రచ్చ రచ్చయింది.

బీజేపీ నేత వ్యంగ్యాస్త్రాలు.. అది టీఎంసీ కల్చర్ అంటూ ఎద్దేవా
బీజేపీ నేత సునీప్ దాస్ ఆ ఎపిసోడ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వీడియోలో నాకు కొత్తగా ఏమి కన్పించలేదంటూ సెటైర్లు వేశారు. అది మొదటినుంచి టీఎంసీ కల్చరే కదా అంటూ ఎద్దేవా చేశారు. పార్టీ అధినేత్రికి తెలియకుండా టీఎంసీ కార్యకర్తలు ఏ పని చేయబోరని.. ఈ ఘటనపై ఆమె ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అదలావుంటే దీనంతటికీ కారణమైన ఆ పార్టీ ఎంపీ మిమి చక్రవర్తి కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ తీరుగా సాగుతున్న పరోక్ష యుద్దానికి ఈ రికార్డింగ్ డ్యాన్స్.. మండుతున్న అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications