వేధింపులకు గురిచేశారు: పశ్చిమబెంగాల్ గవర్నర్‌పై మహిళ సంచలన ఫిర్యాదు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు అక్కడి రాజ్ అక్కడి రాజ్ భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. అయితే, ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు. అయితే శుక్రవారం బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోడీ రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

శుక్రవారం కృష్ణానగర్, వర్ధమాన్ పుర్బా, బోల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌పై ఇలాంటి ఆరోపణలను రావడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, ఈ ఆరోపణలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. సత్యం గెలుస్తందని వ్యాఖ్యానించారు. కల్పిత కథనాలను చూసి తాను భయపడనని చెప్పారు. 'ఇలా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా కోరుకుంటే.. గాడ్ బ్లెస్ దెమ్. కానీ, బంగాల్లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఆపలేరు' అని బోస్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications