స్పీకర్, పళని, పన్నీర్ భేటీ: రెబల్ ఎమ్మెలేల మీద అనర్హత వేటు ? టెన్షన్ తో రిసార్ట్ లో టీవీ !
తమిళనాడు స్పీకర్ ధనపాల్ తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం మధ్యహ్నాం భేటీ అయ్యారు.
చెన్నై: తమిళనాడు స్పీకర్ ధనపాల్ తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం మధ్యహ్నాం భేటీ అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేల విషయంపై ముగ్గురు చర్చలు జరుపుతున్నారు.
చెన్నైలోని సచివాలయంలో స్పీకర ధనపాల్, సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ అయ్యి కర్ణాటకలోని కొడుగు ప్రాంతంలో రిసార్ట్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటూ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.

తమిళనాడు ప్రభుత్వం మీద ఎందుకు తిరుగుబాటు చేశారు ? అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఎందుకు పాటించడం లేదు అని సమాధానం ఇవ్వాలని స్పీకర్ ధనపాల్ ఇప్పటికే మూడు సార్లు దినకరన్ గ్రూప్ లో ఉన్న 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.
మూడో సారి పంపించిన నోటీసులకు గురువారం సాయంత్రంతో గడుపు పూర్తి అయ్యింది. రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని తమిళనాడు ప్రభుత్వ చీప్ విప్ రాజేంద్రన్ శుక్రవారం ఉదయం స్పీకర్ ధనపాల్ కు మనవి చేశారు.
ప్రభుత్వ చీప్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ తో భేటీ అయిన కొన్ని గంటలకే ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఆయనతో భేటీ కావడంతో ఏం జరుగుతుందో అంటూ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు కొడుగులోని రిసార్ట్ లో టీవీల ముందు కుర్చుని టెన్షన్ తో హడలిపోతున్నారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications