వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ కు చెక్ పెడుతున్న సీఎం: ఐఏఎస్ లు, సెక్రటేరియట్ లో ? సెల్వం రివర్స్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారని వెలుగు చూసింది. సచివాలయంలో పన్నీర్ సెల్వం, ఆయన వర్గంలోని నాయకులకు ఎలాంటి పనులు జరగకుండా చూడాలని ఎడప్పాడి పళనిసామి నిర్ణయించారని తెలిసింది.

<strong>డ్రామాలు ఆడితే చర్చలు రద్దు: పన్నీర్ సీరియస్: డెడ్ లైన్, తేల్చకుంటే!</strong>డ్రామాలు ఆడితే చర్చలు రద్దు: పన్నీర్ సీరియస్: డెడ్ లైన్, తేల్చకుంటే!

పన్నీర్ సెల్వంకు సెక్రటేరియట్ లో ఎవరెవరు సహకరిస్తున్నారు ? ఆయనకు అ పనులు పూర్తి చేసి పెడుతున్న ఐఏఎస్ అధికారులు ఎవరు ? అంటూ ఎడప్పాడి పళనిసామి పూర్తి వివరాలు సేకరిస్తున్నారని వెలుగు చూసింది. పన్నీర్ సెల్వం అన్ని పనులకు బ్రేక్ వేసి ఆయన వర్గంలోని నాయకులను కట్టడి చెయ్యాలని పళనిసామి తీర్మానించారని సమాచారం.

పళనిసామి వర్గం

పళనిసామి వర్గం

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం మూడు సార్లు పని చేసిన సమయంలో ఆయనతో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కొందరు అధికారులు పన్నీర్ సెల్వంతో టచ్ లో ఉన్నారని తెలిసింది.

తమిళనాడు చీఫ్ సెక్రటరీ

తమిళనాడు చీఫ్ సెక్రటరీ

ఐటీ దాడులు జరగడంతో అప్పటి తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామ్మోహన్ రావును అప్పట్లో సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి గిరిజా వైద్యనాథన్ ను నియమిస్తూ పన్నీర్ సెల్వం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ పని చేస్తున్నారు.

పన్నీర్ సెల్వం పనులు మొత్తం జరుగుతున్నాయి !

పన్నీర్ సెల్వం పనులు మొత్తం జరుగుతున్నాయి !

అధికారంలో ఉన్నా, లేకపోయినా పన్నీర్ సెల్వం పనులు మొత్తం జరుగుతున్నాయని, ఆయనను కట్టడి చేయాలంటే సెక్రటేరియట్ లో పన్నీర్, ఆయన వర్గీయుల పనులు అన్నీ నిలిచిపోయేలా చెయ్యాలని పళనిసామి మీద ఆయన వర్గీయులు ఒత్తిడి తీసుకువస్తున్నారని వెలుగు చూసింది.

ఐఏఎస్ లు కంట్రోల్ లో ఉండాలని !

ఐఏఎస్ లు కంట్రోల్ లో ఉండాలని !

సెక్రటేరియట్ లోని కొందరు ఐఏఎస్ అధికారులను కంట్రోల్ లో పెట్టడానికి ఎడప్పాడి పళనిసామి కసరత్తులు మొదలు పెట్టారని వెలుగు చూసింది. మంగళవారం కొందరు ఐఏఎస్ అధికారులతో సీఎం ఎడప్పాడి పళనిసామి మాట్లాడారని తెలిసింది.

పన్నీర్ సెల్వం కథ ఏంటి ?

పన్నీర్ సెల్వం కథ ఏంటి ?

పన్నీర్ సెల్వం మీమీద ఒత్తిడి తీసుకు వచ్చి ఏమైన బలవంతంగా పనులు చేయించుకుంటున్నారా ? ఆయన మీతో టచ్ లో ఉన్నారా ? అంటూ సీఎం ఎడప్పాడి పళనిసామి కొందరు ఐఏఎస్ అధికారుల దగ్గర ఆరా తీశారని తెలిసింది.

అక్కడ కట్ చేస్తే దారికి వస్తారు

అక్కడ కట్ చేస్తే దారికి వస్తారు

పన్నీర్ సెల్వం వర్గాన్ని పూర్తిగా కట్టడి చేసి తమ దారిలోకి తెచ్చుకోవాలంటే ఇదే సరైన మార్గం అంటూ ఎడప్పాడి పళనిసామి మీద కొందరు మంత్రులు, ఆయన వర్గీయులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రభుత్వంలో ఆయనకు ఒక్క పని కూడా జరగకుండా చెయ్యాలని పావులు కదుపుతున్నారని తెలిసింది.

పన్నీర్ సెల్వం రివర్స్ స్కెచ్

పన్నీర్ సెల్వం రివర్స్ స్కెచ్

సీఎంగా పని చేస్తున్న సమయంలో అధికారుల విధులకు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా తనపని తాను చేసుకు వెళ్లిన పన్నీర్ సెల్వం తమిళనాడులోని సీనియర్ ఐఏఎస్ అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పళనిసామి ఎత్తులు గురించి తెలుసుకున్న పన్నీర్ సెల్వం సీఎం వర్గానికి రివర్స్ లో చెక్ పెట్టడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

English summary
Tamil Nadu CM Edappadi Palanisamy is trying to break the Pro OPS lobby in the secretariat. He has asked the IAS officers to be in order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X