మాట మాట్లాడని గవర్నర్, ఆర్మీ-పోలీస్ మోహరింపు: 24 గం.తర్వాతే అమ్మ ఆరోగ్యంపై..
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు గుండెపోటు రావడంతో ఆమెను సాధారణ వార్డు నుంచి ఐసీయూకి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందంతో ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. కార్డియాలజిస్టులు, పల
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు గుండెపోటు రావడంతో ఆమెను సాధారణ వార్డు నుంచి ఐసీయూకి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందంతో ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులు సేవలు అందిస్తున్నారు.
అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తం
జయలలితకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అపోలో ఆసుపత్రికి తరలి వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్సును మోహరించారు. కార్యకర్తలు అపోలో ఆసుపత్రిలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. గేటు దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో అపోలో వద్ద ఉద్రిక్తత కనిపిస్తోంది.

ఎప్పుడేం జరిగింది.. టైమ్ లైన్
- జయలలిత ఆరోగ్యం విషయమై సోమవారం ఉదయం వరకు కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు పోలీసులు, ఆర్మీ మోహరించడం, అభిమానులలో ఆందోళన పెరగడం, అపోలో వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంలో మార్పు లేదు.
- ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు సీనియర్ మంత్రులతో రాజ్ భవన్లో భేటీ అయ్యారు.
- పోలీసులకు సెలవులు రద్దు చేశారు. మండలస్థాయి నుంచి భారీ బందోబస్తు ఉంటుంది.
- పోయెస్ గార్డెన్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
- జయలలిత ఆరోగ్యం గురించి 24 గంటల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అపోలో వర్గాలు చెబుతున్నాయి.
- సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయవద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
- గవర్నర్ ప్రకటన కోసం యావత్ భారతం ఎదురు చూస్తోంది. పది నిమిషాలు అపోలోలో ఉన్న గవర్నర్ విద్యాసాగర రావు ఒక్క మాట మాట్లాడకుండా వెళ్లిపోయారు.
- అపోలో వద్ద అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడారు. అమ్మకు ఏమయిందో తెలియక వారు ఏడుస్తున్నారు.
- పోలీసులు అందరూ సోమవారం ఉదయం ఏడు గంటలకు డ్యూటీ రిపోర్ట్ చేయాలి. డిజిపి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
- గవర్నర్ విద్యాసాగర రావు అపోలో ఆసుపత్రిలో కేవలం పదినిమిషాలు మాత్రమే ఉన్నారు. ఆయన ఆసుపత్రిలో ఎవరిని కలిశారో తెలియరాలేదు. రాజ్ భవన్ నుంచి ఏదైనా ప్రకటన రావొచ్చునని భావిస్తున్నారు.
- జయలలితకు గుండెపోటు వచ్చిందనే విషయం తెలిసి ఆవేదన చెందినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
- జయ ఆరోగ్యాన్ని 8 మంది వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. లండన్ వైద్యుడు రిచర్డ్ బాలేను సంప్రదించారు.
- జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- అన్నా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు సోమవారం బంద్ ఉంటాయి. సోమవారం తమిళనాడు వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్.
- అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీఫ్ సెక్రటరీ మాట్లాడే అవకాశముంది. అలాగే రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన రావొచ్చు.
- చెన్నై బయలుదేరిన ఇధ్దరు కేంద్రమంత్రులు
- చెన్నై ఆసుపత్రి పరిసరాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం
- తమిళనాడులో ఆర్మ్‌డ్, రిజర్వ్ బలగాల మోహరింపు
- జయకు చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు బయలుదేరారు.
- - జయ కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. - జయలలితకు చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు బయలుదేరారు. వారి సోమవారం అపోలోకు చేరుకుంటారు.
- తమిళనాడు వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. చాలా ప్రాంతాలకు రాత్రి బస్సులు రద్దయ్యాయి.
- రాత్రి 10.30 గంటల సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. జయకు గుండెపోటు వచ్చిందని తెలిసి ఆవేదనకు లోనయ్యానని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
- ఆ తర్వాత కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆపోలో ఆశుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు.
- రాత్రి 10.15 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ జయ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
- రాత్రి 10 గంటలకు ఆపోలో ఆసుపత్రిలో పోలీసు అధికారులు, మంత్రులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
- రాత్రి 9.45 నిమిషాలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గవర్నర్ విద్యాసాగర రావుకు ఫోన్ చేసి జయ ఆరోగ్యంపై వాకబు చేశారు.
- రాత్రి తొమ్మిదిన్నర గంటలకు విద్యాసాగర రావు హుటాహుటిన చెన్నై వస్తున్నట్లు తెలిసింది.
- రాత్రి తొమ్మిదింపావు గంటల సమయానికి అపోలో ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. జయలలితకు చికిత్స కొనసాగుతుందని ప్రకటించారు. ఆమెకు గుండెనొప్పి వచ్చినట్లు ప్రకటించారు.
- ఎనిమిది గంటలకు కూడా అపోలో ఆసుపత్రికి పెద్ద ఎత్తున జయ అభిమానులు, కార్యకర్తలు రావడం ప్రారంభించారు.
- ఏడు గంటలకు తమిళనాడు వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు అలర్ట్‌గా ఉండాలని సూచనలు అందాయి. అపోలోలో ఆసుపత్రి పరిస్థితిల నేపథ్యంలో అలర్ట్ అయ్యారు.
- ఆరు గంటలకు అపోలో ఆసుపత్రి వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా కనిపించాయి.
- ఐదున్నర గంటలకు విషయం తెలియగానే సీనియర్ మంత్రులు, అధికారులు అపోలో ఆసుపత్రికి తరలి వచ్చారు.
- సాయంత్రం 5 గంటలకు.. జయలలితకు గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications