వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా జర్నలిస్ట్‌ల్ని చితకబాదిన శశికళ వర్గం: చిన్నమ్మ-ఎమ్మెల్యేల కంటతడి

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ రెండోసారి రిసార్టులలో ఉన్న తన వర్గం ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. శనివారం నాడు తొలిసారి ఎమ్మెల్యేలను కలిసిన ఆమె, ఆదివారం నాడు మరోసారి కలుసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ రెండోసారి రిసార్టులలో ఉన్న తన వర్గం ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. శనివారం నాడు తొలిసారి ఎమ్మెల్యేలను కలిసిన ఆమె, ఆదివారం నాడు మరోసారి కలుసుకున్నారు.

జయ టైంలో ఎన్నో చూశా, నేను చస్తానని రాయలేదు: శశికళ సంచలనంజయ టైంలో ఎన్నో చూశా, నేను చస్తానని రాయలేదు: శశికళ సంచలనం

నేను మహిళను కాబట్టి..

అంతకుముందు, పోయెస్ గార్డెన్ నుంచి ఆమె రిసార్టుకు వెళ్లే సమయంలో విలేకరులతో మాట్లాడారు. తాను మహిళను కాబట్టి తనను టార్గెట్ చేసుకున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జయలలిత కూడా రాజకీయాల్లో ఇలాంటివి ఎదుర్కొన్నారని చెప్పారు. తాను ఎప్పుడు ఆమె వెంటే నిలిచానని చెప్పారు. ఓ మహిళ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమన్నారు. చాలామంది తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు.

జర్నలిస్టుల పైన దాడి

ఓ వైపు శశికళ.. తాను మహిళను కాబట్టి లక్ష్యంగా చేసుకున్నారని చెప్పిన కొద్ది గంటల్లోనే అన్నాడీఎంకేలోని శశికళ మద్దతుదారులు రిసార్టు వద్ద మహిళా జర్నలిస్టుల పైన దాడి చేశారు.

అయినప్పటికీ శశికళ రిసార్టులోకి వెళ్లి తన ఎమ్మెల్యేల సమావేశమయ్యారు. ఈ సమయంలో అక్కడి గ్రామస్తులు, పలువురు జర్నలిస్టులు రిసార్ట్ బయట ఆందోళన చేపట్టారు. పలువురు శశికళ కారును కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

బోరుమన్న ఎమ్మెల్యేలు

గోల్డెన్ రిసార్టుకు వెళ్లిన శశికళకు అక్కడ కొందరు మహిళలు హారతులు కూడా పట్టారు. మరోవైపు, రిసార్టులో ఎమ్మెల్యేలతో మాట్లాడే సమయంలో శశికళ అమ్మను తలుచుకొని కంటతడి పెట్టగా, ఎమ్మెల్యేలు కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారని తెలుస్తోంది. మీరు అండగా నిలిస్తే, ఏదైనా సాధిస్తానని, మడమ తిప్పేది లేదని, అమ్మతో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అంతే దృఢ సంకల్పంతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆమె చెప్పారు.

శశికళ సై, అంతకంతకూ పెరుగుతున్న పన్నీరు: పాండ్యరాజన్ గందరగోళంశశికళ సై, అంతకంతకూ పెరుగుతున్న పన్నీరు: పాండ్యరాజన్ గందరగోళం

గవర్నర్‌తో ఎంపీ మైత్రేయన్‌ భేటీ

తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర రావుతో పన్నీర్‌ సెల్వం వర్గానికి చెందిన ఎంపీ మైత్రేయన్‌ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు గవర్నర్‌తో సమావేశమైన మైత్రేయన్‌ తాజా రాజకీయ పరిస్థితులను వివరించినట్లు సమాచారం.

English summary
For the second time in two days, AIADMK's interim general secretary Sasikala Natarajan met MLAs herded at a resort in the outskirts of Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X