కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, కోర్టులో కుప్పకూలిన ప్రొఫెసర్ నిర్మలా దేవి !
చెన్నై: కాలేజ్ విద్యార్థులకు సెక్స్ పాఠాలు చెప్పిందని, వారిని వ్యభిచార ఉచ్చులోకి దింపాలని వెలుగు చూడటంతో అరెస్టు అయిన తమిళనాడులోని అరుప్పుకోటై మహిళా కాలేజ్ మాజీ ప్రొఫెసర్ నిర్మలాదేవి శ్రీ విల్లిపుత్తూరు జిల్లా మహిళా కోర్టులో హఠాత్తుగా స్పృహతప్పి కుప్పకూలిపోయింది. మహిళా కాలేజ్ అమ్మాయిలకు లైంగిక ఎర వేసిందని ప్రొఫెసర్ నిర్మలా దేవిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం శ్రీవిల్లిపుత్తూరు మహిళా కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది.

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు
మదురై కామరాజర్ యూనివర్శిటీలోని కొందరు పెద్దలకు లైంగిక సుఖం ఇస్తే మీకు పరీక్షలో ఎక్కువ మార్కులు వేసి పాస్ చేస్తారని, మీరు విలాసవంతమైన జీవితం గడపటానికి మీ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారని, ఈ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయని అరుప్పుకోటై మహిళా కాలేజ్ అమ్మాయిలకు ప్రొఫెసర్ నిర్మలా దేవీ సెక్స్ పాఠాలు చెప్పారని కేసు నమోదైయ్యింది.

ఆడియో వైరల్
కాలేజ్ విద్యార్థులకు నిర్మలా దేవి సెక్స్ పాఠాలు చెప్పిన ఆడియో టేప్ లు బయటకు రావడంతో అవి వైరల్ అయ్యాయి. కాలేజ్ అమ్మాయి కొందరు దైర్యంగా ముందుకు వచ్చి నిర్మాలా దేవి భాగోతం మొత్తం పోలీసులకు చెప్పారు. గత కొన్ని నెలల క్రితం దేశ వ్యాప్తంగా నిర్మలా దేవి వ్యవహారం చర్చకు దారి తీసింది. తమిళనాడు ప్రభుత్వంతో సహ ఆ రాష్ట్ర గవర్నర్, ప్రతిపక్షాలు ఈ విసయంలో సీరియస్ అయ్యారు.

నిర్మలా దేవి అండ్ కో
కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ నిర్మలా దేవితో సహ మురుగన్, పీహెచ్ డీ విద్యార్థి కరుప్పస్వామిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో నిర్మలా దేవిని కాపాడటానికి చాల మంది పెద్దలు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఎక్కడ నిర్మలా దేవిని కాపాడితే ఈ కేసు తమ మెడకు చుట్టుకుంటుందో అనే భయంతో వారు చివరికి వెనక్కి తగ్గారు.

విచారణకు నిర్మలా దేవి
కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పారని అరెస్టు అయిన నిర్మలా దేవి శ్రీవిల్లిపుత్తూరు జిల్లా మహిళా కోర్టులో జరిగే వాయిదాలకు హాజరు అవుతున్నారు. కోర్టు విచారణకు నిర్మలా దేవితో పాటు మురుగన్, కురుప్పు స్వామి హాజరైనారు.

కోర్టులో స్పృహ తప్పింది
న్యాయమూర్తి కేసు విచారణ చేస్తున్న సమయంలో నిర్మలా దేవి కోర్టులో కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు, అక్కడే ఉన్న వారు నిర్మలా దేవికి ప్రాథమిక చికిత్స అందించారు. కేసు విచారణ 23వ తేదీకి వాయిదా పడింది. 23వ తేదీ కోర్టు విచారణకు నిర్మలా దేవి కచ్చితంగా హాజరు కావాలని న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. నిర్మలా దేవి తలకు గుండు కొట్టుకుని కోర్టుకు హాజరైనారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications