వ్యూహాత్మకంగా బీజేపీ, మాయావతికి రివర్స్
97 మంది ముస్లీంలు, 106 మంది ఓబీసులు, ఓసీలకు 113, ఓసీలలోని బ్రాహ్మణులకు 66 మందికి టిక్కెట్లు ఇచ్చారు. అంతేకాకుండా, దళితులలో జాతవ్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తారనే వాదనలు ఉన్నాయి.
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతికి రివర్స్ అవుతోందా? బీఎస్పీలో జాతవ్‌లకు ప్రాధాన్యత ఎక్కువ కావడం వల్ల ఇతర దళిత ఉపకులాలు ఆ పార్టీకి దూరం జరుగుతున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
యూపీలో దళితుల జనాభా ఇరవై శాతానికి పైగా ఉంది. ఉపకులాలు 66 ఉన్నాయి. ఇందులో జాతవ్ వర్గమే 56 శాతానికి పైగా ఉంది. ఆ తర్వాత పాసీలు దాదాపు పదహారు శాతం ఉన్నారు. దోబీ, కోరి, వాల్మికీ తదితరులు మిగతా వారు.
ఈసారి 403 అసెంబ్లీ సీట్లకు గాను 85 స్థానాలు ఎస్సీకి రిజర్వ్ అయ్యాయి. మాయావతి 87 మంది దళితులను మాత్రమే బరిలోకి దించారు. అందులో రిజర్వ్ అయినవే 85. జనరల్ కేటగిరీ స్థానాల్లో కేవలం ఇద్దరిని మాత్రమే ఎక్కువగా నిలిపారు.
97 మంది ముస్లీంలు, 106 మంది ఓబీసులు, ఓసీలకు 113, ఓసీలలోని బ్రాహ్మణులకు 66 మందికి టిక్కెట్లు ఇచ్చారు. అంతేకాకుండా, దళితులలో జాతవ్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తారనే వాదనలు ఉన్నాయి.

మాయావతి అలా గెలిచారు
2007లో బీఎస్పీ 62 రిజర్వ్‌డ్ స్థానాలు గెలుచుకుంది. దానికి తోడు బ్రాహ్మణ - దళిత - ముస్లీంలు అప్పుడు ఆమె వైపు మొగ్గారు. నాడు బ్రాహ్మణులకు కూడా ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చారు. దీంతో సులభంగా గెలుపొందారు.

బీజేపీ వైపు మరలుతున్నారు
2007లో నాలుగు సీట్లు తగ్గినప్పటికీ బీఎస్పీనే ఎక్కువ రిజర్వ్‌డ్ స్థానాలు గెలుచుకున్నారు. అయితే, జాతవులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో దళితుల్లోని ఇతర ఉప కులాలు కాంగ్రెస్, బీజేపీల వైపు మరలుతున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో..
గత సార్వత్రిక ఎన్నికల్లో జాతవేతరులు దాదాపు మూడొంతుల్లో రెండొంతుల మంది బీజేపీ వైపు మొగ్గారు. ఈ కారణంగా ఎస్సీలకు రిజర్వ్‌డ్ చేసిన 17 స్థానాలు కమలం పార్టీ గెలుచుకుంది. ముజఫర్ నగర్, ఫైజాబాద్, వారణాసి, గోరక్‌పూర్ తదితర ప్రాంతాల్లో బీజేపీకే జాతవేతరుల మద్దతు ఉంటుంది.

బీజేపీ వ్యూహం
ఇప్పుడు కూడా బీజేపీ అగ్రవర్ణాలతో పాటు దళితుల ఓటు బ్యాంకు వైపు దృష్టి పెట్టింది. యాదవ్‌లు ఎస్పీని వదిలి వచ్చే పరిస్థితి లేదు. దళిత ఎంపీలు కూడా బీజేపీ గెలుపు కోసం రంగంలోకి దిగారు. దీంతో రిజర్వ్‌డ్ స్థానాల్లో మాయావతికి చిక్కులు తప్పేలా లేవంటున్నారు. అగ్రవర్ణాలు ఎక్కువగా బీజేపీ వైపే ఉంటారు.












Click it and Unblock the Notifications