అసాధారణ రీతిలో.. యూపీలో 'యోగి' పాలనపై ఓ కన్నేసి ఉంచిన మోడీ

Subscribe to Oneindia Telugu

లక్నో: యూపీలో కొత్త సీఎంగా కొలువుదీరిన యోగి ఆదిత్యానాథ్ ను ఆయన అనుచరులు 'భవిష్యత్తు ప్రధాని' అంటూ ఇప్పటినుంచే ట్యాగులు తగిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు ప్రధాని మోడీ సైతం యోగి పాలనపై ఓ కన్నేసి ఉంచాలని పీఎంవో వర్గాలను ఆదేశించారు.

పీఎంవో ఆదేశానుసారం ప్రభుత్వాన్ని నడిపిస్తూ.. పాలనా సంబంధమైన వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి అందించేలా మోడీ ఓ ప్రత్యేక ఐఏఎస్ అధికారిని సైతం నియమించడం గమనార్హం. 'అసాధారణ రీతిలో ఐఏఎస్ నృపేంద్రమిశ్రాను యూపీ పాలనా పర్యవేక్షకుడిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది'.

To keep tab on CM Yogi Adityanath, PM Modi's office appoints senior IAS officer as Centre's monitor

ఇదే క్రమంలో పీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా ఆదివారం నాడు సీఎం యోగితో దాదాపు 45నిమిషాల పాటు భేటీ అయ్యారు. దీంతో ఇకనుంచి సీఎం యోగికి, పీఎం మోడీకి మధ్య మిశ్రా దూతగా వ్యవహరిస్తారన్న సంకేతాలు వెలువెడ్డాయి. ఈ మేరకు జాతీయ మీడియా ఇండియా టుడే ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

కాగా, యూపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన నృపేంద్రమిశ్రాను 2014లో ప్రధాని మోడీ ఏరి కోరి కేంద్రానికి పిలిపించుకున్నారు. యూపీ ప్రభుత్వం ఇకముందు చేపట్టబోయే నియామకాలను సైతం మిశ్రానే ధ్రువీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a unusual move to keep the Uttar Pradesh administration under the close watch of the Centre, it has been decided that the Yogi Adityanath government will get direction from the Prime Minister's Office directly.
Please Wait while comments are loading...