Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Today in Parliament: అద్దె గర్భాల క్రమబద్దీకరణ?: పునరుత్పత్తి క్లినిక్స్, బ్యాంక్స్: కీలక బిల్లు

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ ఉదయం పునః ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 23వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఎప్పట్లాగే ఈ సారి కూడా పార్లమెంట్ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఉభయ సభలు ఆమోదించింది ఈ సెషన్‌లోనే. మొత్తంగా 26 బిల్లులు శీతకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభ ముందుకు రానున్నాయి.

అద్దె గర్భాల క్రమబద్దీకరణ కోసం..

అద్దె గర్భాల క్రమబద్దీకరణ కోసం..

అద్దె గర్భం (సరోగసీ) విధానానికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ భాయ్ మాండవీయ.. దీన్ని టేబుల్ చేస్తారు. సరోగసీ విధానాన్ని క్రమబద్దీకరించే బిల్లు ఇది. ఈ విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయనుంది కేంద్రం. అలాగే- రాష్ట్ర స్థాయిలోనూ బోర్డులను నెలకొల్పేలా ప్రతిపాదనలను రూపొందించింది. వాటిని ఈ బిల్లులో పొందుపరిచింది.

రాజ్యసభలో బిల్లు..

రాజ్యసభలో బిల్లు..

దేశంలోన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సరోగసీ బోర్డులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఆ బిల్లును ఇదివరకే లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పటికీ.. అది ఆమోదం పొందలేదు. దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది రాజ్యసభ. తాజాగా- ఇదే బిల్లును కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పెద్దల సభలో ప్రవేశపెడతారు.

పునరుత్పత్తి క్లినిక్స్..

పునరుత్పత్తి క్లినిక్స్..

దీనితోపాటు- అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్స్, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బ్యాంక్స్, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ సర్వీసెస్‌కు సంబంధించిన బిల్లును కూడా ఆయన సభలో ప్రవేశపెడతారు. పురుషుల పునరుత్పత్తికి సంబంధించిన అంశాలు ఇవన్నీ. పునరుత్పత్తి కణాలు ఎంబ్రాయిసిస్, ఎంబ్రియానిక్ టిష్యూలను భద్రపరచడం, దీనికి సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించడం, వాటిపై పరిశోధనలు చేయడం వంటి కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఈ బిల్లు ఉంటుంది.

నాగాలాండ్ ఘటనపై

నాగాలాండ్ ఘటనపై

సోమవారం నాటి పార్లమెంట్ సమావేశాలను నాగాలాండ్ కాల్పుల ఘటన కుదిపేసింది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అమిత్ షా దీనిపై ఓ ప్రకటన చేశారు. దురదృష్టశావత్తూ ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఉద్దేశపూరక కారణాలేవీ లేవని స్పష్టం చేశారు. అదే సమయంలో నాగాలాండ్ పోలీసులు.. ఈ కాల్పులకు పాల్పడిన ఆర్మీ జవాన్లపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఆర్మీ ఉన్నతాధికారులు కూడా దీనిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు.

Recommended Video

    Nagaland : దారుణ ఘటన India Forces పై కేసు | Amit Shah || Oneindia Telugu
    12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై

    12 మంది సభ్యుల సస్పెన్షన్‌పై

    రాజ్యసభలో 12 మంది సభ్యులపై సస్పెన్షన్ కొనసాగుతోంది. సస్పెన్షన్ వేటుకు గురైన వారిలో రాజ్యసభ సభ్యురాలు సంసద్ టీవీ యాంకర్ కూడా ఉన్నార. తనను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సంసద్ టీవీ యాంకర్ హోదా నుంచి తప్పుకొన్నారు. అలాగే- ఈ చర్యకు నిరసనగా కాంగ్రెస్‌కు చెందిన తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్.. సంసద్ టీవీ నుంచి వైదొలిగారు. తన పదవికి ఆయన రాజీనామా చేశారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్ చేస్తోన్నారాయన.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+