చన్నీ హర్టెడ్: తనే కాదు భార్య పేరు మీద కూడా ఆస్తులు కొనుగోలు చేయ..
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని.. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ చన్నీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వివాదం రాజుకుంది. మిగతా సీఎం ఆశవాహులు.. ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఇదీ కామనే.. కానీ ఇప్పుడు మాత్రం అసమ్మతి తప్పడం లేదు. దీంతో చన్నీ లైన్‌లోకి వచ్చారు. తనపై విమర్శలు రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

40 ఏళ్లలో ఎవరూ ఇలా..?
ఆస్తులు, వాణిజ్య స్థలాలు తన పేరు మీద కానీ.. తన భార్య పేరు మీద కానీ కొనుగోలు చేయబోనని చెప్పారు. అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి ఆప్ నేతలు చన్నీపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇలా కామెంట్ చేశారు. గత 40 ఏళ్లలో ఎవరూ తనను వెలేత్తి చూపించలేదని చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఆ సమయంలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా అక్కడే ఉన్నారు. రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు.

ఆప్ విమర్శలు..
ఆప్ నేత రాఘవ్ చద్దా మాత్రం తన విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు. 3 కోట్ల పంజాబీలలో చన్నీ తప్ప మిగతా నేతలు లేరా అని అడిగారు. ఇసుక అక్రమ రవాణా, అధికారుల బదిలీకి సంబంధించి అవినీతికి పాల్పడిన వారికి వెన్నుదన్నుగా నిలిచిన వారికే.. కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని కామెంట్ చేశారు. చన్నీ మేనల్లుడి ఇంటి వద్ద ఈడీ దాడి చేసిన సంగతి తెలిసిందే. రూ.10 కోట్ల నగదు కూడా లభించింది. కార్లు, ఆభరణాలు కూడా కనిపించాయి. ఈ మేరకు వీడియోలో పేర్కొన్నారు.

వాయిదా..
ఇటు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగిసాయి. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.












Click it and Unblock the Notifications